ఆదివాసీలకు, వన్యప్రాణులకు ముప్పుగా మారిన అడవుల నరికివేత..

వీడియో క్యాప్షన్, ఆదివాసీలకు, వన్యప్రాణులకు ముప్పుగా మారిన అడవుల నరికివేత...
ఆదివాసీలకు, వన్యప్రాణులకు ముప్పుగా మారిన అడవుల నరికివేత..

మొజాంబిక్‌లోని చిమానిమని ప్రాంతంలో అడవుల నరికివేత వల్ల వన్య ప్రాణులకు ముప్పు ఏర్పడటంతో అడవుల సంరక్షణకు స్థానికులే ముందుకొచ్చారు. 2072 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో చెట్లను పెంచుతున్నారు. బీబీసీ ప్రతినిధులు ఏంజెలా హెన్షల్, జోస్ టెంబే అందిస్తున్న కథనం.

మొజాంబిక్‌లో దాదాపు సగభాగం అటవీ ప్రాంతమే. అయితే, గత రెండు దశాబ్దాల్లో ఈ దేశం 40 లక్షల హెక్టార్ల అడవిని కోల్పోయింది.

అడవుల నరికివేత ప్రభావం సెంట్రల్ మొజాంబిక్‌లో చిమానిమని నేషనల్ పార్క్ చుట్టుపక్కల నివసించే సముదాయాలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది.

మొజాంబిక్‌లో నగరాలకు అవసరమైన బొగ్గు తయారీ కోసం, వ్యవసాయ భూముల కోసం స్థానికులు అడవులను ధ్వంసం చేశారు. లాభాలు తెచ్చే కలప కోసం కూడా అడవుల్ని కొట్టివేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో కదలిక తెచ్చింది.

అయితే మొజాంబిక్‌లోని ఇతర ప్రాంతాల్లో కలప కోసం అడవుల నరికివేత కొనసాగుతున్నట్లు బీబీసీ గుర్తించింది.

మొజాంబిక్‌లోని వివిధ ప్రాంతాల్లో కలప అక్రమ రవాణా కొనసాగుతోందని ఎన్విరాన్‌మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అనే స్వచ్ఛంద సంస్థ నాలుగేళ్ల పాటు నిర్వహించిన అంతర్గత విచారణలో వెల్లడైంది.

మొజాంబిక్ ఆదివాసీ కార్యకర్త

అక్రమ కలప రవాణాలో పాత రోజ్‌వుడ్ చెట్లను ప్రత్యేకంగా ఎంచుకున్నట్లు తేలింది. సైట్స్ అని పిలిచే అంతర్జాతీయ పరిరక్షణ ఒప్పందం కింద రోజ్‌ వుడ్‌ను రక్షించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అక్రమ రవాణా జరుగుతున్న కలప ఇదే.

గతేడాది చైనాకు భారీగా హోంగ్ము సరఫరా చేసిన ఆఫ్రికన్ దేశంగా మొజాంబిక్ నిలిచిందని గణాంకాలు చెబుతున్నాయి.

చైనాలో హోంగ్ముకు గిరాకీ పెరుగుతోంది, దీంతో మిగిలిపోయిన రోజ్ వుడ్ చెట్లు కూడా ఇప్పుడు లక్ష్యంగా మారాయి.

ఇందులో సైట్స్ ఒప్పందం కింద రక్షించాల్సిన ఉంబిలా, చన్‌ఫుటా రకాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మొజాంబిక్ అడవుల మీద ఇవే కాకుండా, ఇంకా చాలా రకాల ఒత్తిళ్లు ఉన్నాయి. ఈడెన్ లాంటి విజయవంతమైన ప్రాజెక్టులు అడవుల్ని ఎంత వరకు పునరుద్దరిస్తాయన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)