‘అడవులు తగులబడిపోవడం అంటే మానవ మనుగడకే ముప్పు’: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

వీడియో క్యాప్షన్, క్లైమేట్ ఛేంజ్‌కు చెక్ పెట్టేందుకు భారీగా పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చిన జో బైడెన్

యూరప్, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో చెలరేగిన కార్చిర్చులను అదుపు చేయడానికి ఆయా దేశాలు పెద్దమొత్తంలో డబ్బు వెచ్చిస్తాయన్నారు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్.

వాతావరణ మార్పుల కారణంగా మధ్యధరా ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. పోర్చుగల్‌ సహా అనేక యూరోపియన్ దేశాలు మంటలను అదుపు చేయడంపై ఇప్పుడు దృష్టిపెట్టాయి.

పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పోర్చుగల్‌లో అత్యవసర పరిస్థితిని మరికొన్ని రోజులపాటు పొడిగించారు.

స్పెయిన్‌లో ఇటీవలి వడగాల్పుల కారణంగా 500 మందికి పైగా ప్రజలు చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)