కందుకూరు: చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం ఇదేనా

వీడియో క్యాప్షన్, చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం ఇదేనా
కందుకూరు: చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం ఇదేనా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నిర్వహించిన ‘ఇదేం ఖర్మ’ సభలో తొక్కిసలాట కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

చిన్న ప్రదేశంలో సభ నిర్వహించడంతో జనాలు కిక్కిరిసిపోయి ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.

సభ జరిగిన ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.

అది చిన్న ప్రదేశం కావడంతో కిక్కిరిసిపోయారు.

కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగిన ప్రాంతం.. ప్రమాదం తరువాత

చంద్రబాబు ప్రసంగం ప్రారంభించగానే ఒక్కసారిగా ముందుకొచ్చిన జనం

చంద్రబాబు ప్రసంగం మొదలుపెట్టగానే జనాలు ముందుకు రావడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ క్రమంలో పలువురు కింద పడిపోయారు. కొందరు పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయారు.

ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో జరిగింది.

వారిని పైకి తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే శ్వాస ఆడకపోవడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మరణించారు.

ఆసుపత్రికి తరలించిన అనంతరం మరో ఆరుగురు మరణించారు.

ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)