గ్రహాంతర వాసులు మనల్ని గమనిస్తున్నారా?

వీడియో క్యాప్షన్, ఏలియన్స్ భూమి మీద మనుషుల్ని గమనిస్తున్నాయా?
గ్రహాంతర వాసులు మనల్ని గమనిస్తున్నారా?

శాస్త్రవేత్తలు భూమి పరిమాణంలో ఉండే రెండు గ్రహాలను గుర్తించారు. దీనితోపాటు అంతరిక్షం నుంచి ఒక అంతు తెలియని సిగ్నల్ వచ్చిందని కూడా మనం విన్నాం. ఇవి తప్ప గ్రహాంతర వాసుల ఉనికిని ధృవీకరించే బలమైన ఆధారాలేవీ లభించలేదు.

అయితే, ఒకవేళ నిజంగానే గ్రహాంతర వాసులు ఉంటే? మనం చేస్తున్న ప్రయత్నాలు వాళ్లకి తెలిసి, వారు మనల్ని గమనిస్తే? భూమిపై జీవరాశి ఉందని వారికి తెలిసే అవకాశం ఉంటుందా? శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది.

“మనం నిరంతరాయంగా విశ్వంలోకి సిగ్నళ్లను పంపుతున్నామంటే, మన ఉనికిని అద్దంలో చూపిస్తున్నట్లే. ఒకవేళ వారు(ఏలియన్లు) మనల్ని చూస్తే, మనల్ని ఏమని గుర్తిస్తారు?” అని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన ఆస్ట్రో ఫిజిసిస్ట్ జాక్వలిన్ ఫాహెర్టీ ప్రశ్నించారు.

"మనం వారి కోసం చూస్తున్నామంటే, మనల్ని వారు కూడా చూసే అవకాశం ఉంటుంది కదా " అన్నారు.

పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

ఏలియన్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)