దసరాకు భారత్ రాబోతున్న బంగ్లాదేశ్ పులస

వీడియో క్యాప్షన్, దసరాకు భారత్ రాబోతున్న బంగ్లాదేశ్ పులస
దసరాకు భారత్ రాబోతున్న బంగ్లాదేశ్ పులస

దసరా పండగ రోజుల్లో బెంగాలీలకు హిల్సా చేపలతో విందు అనేది దుర్గా పూజలో ముఖ్యమైన భాగం. ఈ హిల్సా చేపలనే తెలుగునాట పులస చేపగా పిలుస్తారు.

దసరా సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ పులస చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.

భారత్‌కు తమ పులస ఎగుమతిపై నిషేధం బెంగాలీలలో కలకలం సృష్టించింది.

అయితే, ఈ నిషేధం కొద్ది రోజుల వ్యవధిలోనే ఎత్తివేయడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ పులసలతో బెంగాలీలు పండగ చేసుకోబోతున్నారు.

బంగ్లాదేశ్‌లో ఈ చేప ఎగుమతిపై ఎప్పటికప్పుడు ఆంక్షలు ఉంటున్నప్పటికీ, గతంలో ప్రభుత్వాలు దసరా సందర్భంగా నిషేధాన్ని ఎత్తివేసేవి. దీనిని బెంగాల్ ప్రజలకు గిఫ్ట్ అని చెప్పుకునేవారు.

 హిల్సా చేపలు
ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలోని ఓ హోల్‌సేల్ చేపల మార్కెట్‌లో హిల్సా చేపలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)