చిరుత పులి భయం, మెడకు ‘ముళ్ల కవచం’

వీడియో క్యాప్షన్, చిరుత పులి భయం, మెడకు ‘ముళ్ల కవచం’
చిరుత పులి భయం, మెడకు ‘ముళ్ల కవచం’

చిరుత పులి దాడుల నుంచి రక్షించుకోవడానికి... ఈ మహిళ తన మెడకు పదునైన ముళ్లతో ఉన్న ఇనుప బెల్ట్ ధరించారు.

మహారాష్ట్రలోని శిరూర్ తాలూకా పింపర్‌ఖేడ్‌లో గత రెండువారాల్లో చిరుత దాడుల్లో ముగ్గురు మరణించారు.

దీంతో స్థానికుల్లో భయం నెలకొంది. చిరుత పులులు ప్రధానంగా మెడపై దాడి చేస్తాయి. అందుకే, ఇలాంటి బెల్ట్ మెడకు పెట్టుకుంటే రక్షణ లభిస్తుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

చిరుత పులి భయం, ఇనుప బెల్ట్‌తో అభయం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)