గోల్డీ బ్రార్: సిద్ధూ మూసేవాల హత్యకు ఎందుకు ఆదేశించారు?

వీడియో క్యాప్షన్, మూడేళ్ల కింద సిద్ధూ మూసేవాలాను తానే చంపించానని ప్రకటించిన గోల్డీ బ్రార్‌ బీబీసీతో ఏం చెప్పారు?
గోల్డీ బ్రార్: సిద్ధూ మూసేవాల హత్యకు ఎందుకు ఆదేశించారు?

మూడేళ్ల కింద ప్రముఖ పంజాబీ రాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన హత్యకు తానే ఆదేశించానని చెబుతున్న గోల్డీ బ్రార్‌తో బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్ బృందం మాట్లాడింది.

గ్యాంగ్ వార్‌లో భాగంగా జరిగినట్టు భావిస్తున్న ఈ హత్యలో ఈనాటికీ ఎవ్వరిపైనా విచారణ జరగలేదు. గ్యాంగ్‌కు సన్నిహితుడైన ఒక రాజకీయ నేత హత్యలో మూసేవాలా భాగమయ్యాడని గోల్డీ ఆరోపించారు.

అయితే, ఆ నేరంలో సిద్ధూ పాత్ర ఉందనేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలూ లేవని పంజాబ్ పోలీసులు బీబీసీతో చెప్పారు. కానీ గోల్డీ మాత్రం మూసేవాలా నేరస్థుడే అని వాదించాడు. పూర్తి వివరాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

సిద్ధు మూసేవాల
ఫొటో క్యాప్షన్, 2022లో సిద్ధూ మూసేవాలను కాల్చి చంపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)