హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మేనియా... గోల్ కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర విశేషాలు - 10 ఫోటోలలో

దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు, అర్జెంటీనా స్టార్ ఆటగాడు శనివారం రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సందడి చేశారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు.

సింగరేణి ఆర్ఆర్9 - అపర్ణ మెస్సీ ఆల్‌స్టార్స్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను మెస్సీ వీక్షించారు.

ఈ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కాసేపు మ్యాచ్ ఆడి, గోల్ కూడా కొట్టారు.

తరువాత మెస్సీ గ్రౌండ్ అంతా కలయతిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. స్టేడియంలో నాలుగుచోట్ల సీఎంరేవంత్ రెడ్డి, మెస్సీ మిగిలిన ఆటగాళ్లతో కలిసి బాల్ పాసవుట్ చేశారు.

ఈ కార్యక్రమానికి లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. విజేతగా నిలిచిన సింగరేణి జట్టుకు మెస్సీ ట్రోఫీని అందచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)