డోనల్డ్ ట్రంప్-కమలా హారిస్: కీలక రాష్ట్రాల ఓటర్ల మద్దతు ఎవరికి?
డోనల్డ్ ట్రంప్-కమలా హారిస్: కీలక రాష్ట్రాల ఓటర్ల మద్దతు ఎవరికి?
డోనల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత, ఎవరికి మద్దతు ఇవ్వాలో ఇంకా నిర్ణయించుకోని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఇద్దరు అభ్యర్థులూ ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.
నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాలను, కేవలం కొన్ని కీలక రాష్ట్రాలకు చెందిన కొన్ని లక్షల ఓట్లు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల్లో ఒకటైన పెన్సిల్వేనియాలో బీబీసీ ప్రతినిధి సుమి సోమస్కంద కొందరు ఓటర్లను కలిసి మాట్లాడారు. బీబీసీ ప్రత్యేక కథనం.










