తెలంగాణ: జూట్ బ్యాగుల తయారీలో ట్రాన్స్‌జెండర్లు
జూట్ బ్యాగులు తయారు చేస్తున్న వీళ్లంతా ట్రాన్స్‌జెండర్లు. బ్యాగుల తయారీతో వీళ్లు స్వయం ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ స్టేట్ విమెన్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దుర్గాబాయి మహిళా శిశు, వికాస కేంద్రం తరఫున వీళ్లకు శిక్షణ ఇస్తున్నారు.
హైదరాబాద్ సూరారంలో ట్రాన్స్‌జెండర్లకు ఈ శిక్షణ ఇస్తున్నారు. 2021లో కూకట్‌పల్లిలో తొలి బ్యాచ్ మొదలైంది. ఇప్పటివరకు 26 మంది ట్రాన్స్‌జెండర్లు శిక్షణ పొందారు.
వీళ్లు కుడుతున్న బ్యాగ్‌లను వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలకు విక్రయిస్తున్నారు. ఈ కేంద్రానికి వచ్చే ట్రాన్స్‌విమెన్‌కు నెలకు 15,600 చొప్పున స్టైఫండ్ ఇస్తున్నామన్నారు అధికారులు.
ఎకనమిక్ రిహాబిలిటేషన్ స్కీమ్‌లో భాగంగా సబ్సిడీపై బ్యాంకు రుణాలు ఇప్పించి ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామని అధికారులు చెప్పారు.
గతంలో భిక్షాటనకు వెళ్లినప్పుడు షాపుల వాళ్లు తమను తిట్టేవారని, కానీ ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారని ఆనందంగా చెప్పారు ట్రాన్స్‌జెండర్లు.
బీబీసీ హైదరాబాద్ ప్రతినిధి యార్గగడ్డ అమరేంద్ర అందిస్తున్న కథనం.
(షూట్ & ఎడిట్: సంగీతం ప్రభాకర్)

ఇవి కూడా చదవండి:
- ‘కొత్త లోకం ఎప్పుడు సృష్టిస్తావు, నీ దగ్గరకు ఎప్పుడు రమ్మంటావు?’’ – ఏమిటీ కల్ట్స్, ప్రజలు వీటిలో ఎందుకు చేరుతున్నారు?
- ట్రాన్స్‌జెండర్ జంట: బిడ్డకు జన్మనిచ్చిన కేరళ కపుల్
- నరేంద్ర మోదీ- సత్యపాల్ మలిక్: రిలయన్స్ కాంట్రాక్ట్‌ను ఈ మాజీ గవర్నర్ అప్పట్లో ఎందుకు రద్దు చేశారు?
- మూల కణాల మార్పిడి: క్యాన్సర్‌తోపాటు హెచ్ఐవీ నుంచి కోలుకున్న అమెరికన్ కథ
- 'చివరి లాటరీ టికెట్'తో రెండున్నర కోట్లు గెలుచుకున్న 89 ఏళ్ల రిక్షావాలా
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



