సీతాకోకచిలుకలను సంరక్షిస్తున్న పాకిస్తాన్ మహిళ

వీడియో క్యాప్షన్, కరాచీ స్కూల్ పిల్లలని ఆకర్షిస్తున్న బటర్‌ఫ్లై క్లబ్...
సీతాకోకచిలుకలను సంరక్షిస్తున్న పాకిస్తాన్ మహిళ

పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన షిరీన్ అబ్దుల్లా ఇరవైయ్యేళ్లుగా ప్రకృతి పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు.

ఆమె సీతాకోకచిలుకల క్లబ్ ప్రారంభించారు. ఇక్కడికి వచ్చే పిల్లలకు సీతాకోకచిలుకల పెంపకం, సంరక్షణ నేర్పిస్తున్నారు.

బీబీసీ ఉర్దూ బృందంతో మాట్లాడిన షిరీన్ అబ్దుల్లా... తాను చేస్తున్న పని ప్రాముఖ్యమేంటో వివరించారు.

తన తండ్రి ప్రకృతిని ఎంతగానో ఇష్టపడతారని.. ఆయన ప్రేరణతోనే తనకు సీతాకోకచిలుకలను కాపాడాలనే ఆలోచన కలిగిందని ఆమె చెప్పారు.

‘ఓసారి నేను ఓ తోటమాలిని కలిసినప్పుడు... అవి కీటకాలే కాబట్టి వాటిని చంపేస్తామని చెప్పాడు. ఆ మాటలు నన్ను చాలా బాధించాయి. అవి కేవలం పురుగులు కాదు. పర్యావరణానికి సాయం చేసే ప్రాణులు’ అన్నారామె.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
షిరీన్ అబ్దుల్లా

బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)