ఉషా చిలుకూరి, ప్రొఫెసర్ శాంతమ్మ: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య గురించి వైజాగ్‌లోని బామ్మ ఏమంటున్నారు

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోని ఉషా చిలుకూరి వాన్స్ బంధువులు ఏమంటున్నారు
ఉషా చిలుకూరి, ప్రొఫెసర్ శాంతమ్మ: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య గురించి వైజాగ్‌లోని బామ్మ ఏమంటున్నారు

అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగువారు.

ఆమె బంధువులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు.

ఆమెకు నాన్నమ్మ వరుసయ్యే ప్రొఫెసర్ శాంతమ్మ విశాఖపట్నంలో నివసిస్తున్నారు.

జేడీ వాన్స్ నామినేషన్ నేపథ్యంలో ‘బీబీసీ తెలుగు’ ఆమెతో మాట్లాడింది.

ఈ సందర్భంగా ఆమె వాన్స్ భార్య ఉషా చిలుకూరి గురించి వివరాలు వెల్లడించారు.

తన భర్త సోదరుడి మనవరాలు ఉషా అని శాంతమ్మ చెప్పారు.

ఉషా తండ్రి కుటుంబం చాలా ఏళ్ల కిందటే అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిపోయిందని చెప్పారామె.

ఉషా చిలుకూరి గురించి శాంతమ్మ ఇంకా ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.

సుమారు 95 ఏళ్ల వయసున్న శాంతమ్మ కొద్దికాలం కిందట వరకు యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు.

ప్రొఫెసర్ శాంతమ్మ, ఉషా చిలుకూరి వాన్స్

ఫొటో సోర్స్, BBC/GettyImages

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ శాంతమ్మ, ఉషా చిలుకూరి వాన్స్