నెల్లూరు: ప్రార్థనల పేరుతో ఆలస్యం వల్లే పాప చనిపోయిందా?

వీడియో క్యాప్షన్, నెల్లూరు: ప్రార్థనల పేరుతో ఆలస్యం వల్లే పాప చనిపోయిందా?
నెల్లూరు: ప్రార్థనల పేరుతో ఆలస్యం వల్లే పాప చనిపోయిందా?

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందడం కలకలం రేపుతోంది.

అనారోగ్యంతో ఉన్న తమ పాపను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా చర్చికి తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉండిపోవడంతోనే ఆమె చనిపోయిందని తల్లిదండ్రులు చెప్పారు.

కలువాయి మండలం బాలాజీరావు పేటకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మి దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని చేజర్ల మండలంలో ఆదురుపల్లిలోని ఒక చర్చికి తీసుకెళ్లారు. పాపకు నయం కావడానికి అక్కడ ప్రార్థనలు చేసినట్లు వారు చెబుతున్నారు.

అయితే, అసలు చిన్నారి ఎలా చనిపోయింది? తల్లిదండ్రులతో పాటు, చర్చి నిర్వాహకులు, డాక్టర్లు ఏం చెబుతున్నారు? తదితర విషయాలను తెలుసుకోడానికి బీబీసీ ప్రయత్నించింది.

నెల్లూరు పాప మృతి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)