‘సునామీ వచ్చినా మావాళ్లు క్షేమంగా తిరిగొచ్చారు.. అందుకే ప్రతి సంవత్సరం ఆ రోజున గంగమ్మకు పూజలు చేస్తాం’
‘సునామీ వచ్చినా మావాళ్లు క్షేమంగా తిరిగొచ్చారు.. అందుకే ప్రతి సంవత్సరం ఆ రోజున గంగమ్మకు పూజలు చేస్తాం’
2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ ప్రభావం విశాఖ తీరంపై పెద్దగా కనిపించలేదు.
ఆ రోజు సముద్రంలో వేటలో ఉన్న తమవారు క్షేమంగా తిరిగి వచ్చారని, అందుకే ఏటా డిసెంబర్ 26న గంగమ్మ పూజలతో పెదజాలారిపేటలో ‘గంగమ్మ తల్లి జాతర’ జరుపుకుంటున్నామని అక్కడి మహిళలు చెప్పారు.
చేపల వేటకు వెళ్లిన వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని మంచిగా వేట జరగాలని గంగమ్మకు పూజలు చేస్తామని మహిళలు తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









