ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం, 10 మంది పసికందుల మృతి, అసలేం జరిగింది?

వీడియో క్యాప్షన్, Video: ఝాన్సీలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం, అసలేం జరిగింది?
ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం, 10 మంది పసికందుల మృతి, అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్‌‌లోని ఝాన్సీ నగరంలో ఉన్న మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో మంటలు చెలరేగి 10 మంది శిశువులు చనిపోయినట్టు ఝాన్సీ జిల్లా కలెక్టర్ అవినాశ్‌ కుమార్ ధ్రువీకరించారు.

ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లో మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగినట్లు ఝాన్సీ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సచిన్ మోహర్ తెలిపారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియో కథనంలో చూడొచ్చు.

Police officers examine the damaged neonatal intensive care unit after a fire broke out at the Maharani Laxmibai Medical College in Jhansi district, in the northern state of Uttar Pradesh,

ఫొటో సోర్స్, Reuters

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)