దిల్లీ: ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో పేలుడు.. 8 మంది మృతి, అమిత్ షా ఏం చెప్పారంటే...

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

దేశ రాజధాని దిల్లీలో సోమవారం సాయంత్రం పేలుడు జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడులో 8 మంది మృతి చెందినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

పేలుడును దిల్లీ అగ్నిమాపక శాఖ కూడా బీబీసీకి ధృవీకరించింది.

తమకు సాయంత్రం 6గంటల 55 నిమిషాలకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబరు 1కు సమీపంలోని కారులో పేలుడు జరిగినట్లు సమాచారం అందిందని దిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ బీబీసీకి తెలిపింది.

ఈ ఘటనలో ఆరువాహనాలు దగ్ధమయ్యాయని, సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.

దిల్లీ ఎర్రకోట

ఈ పేలుడులో 8 మంది మృతి చెందినట్లు దిల్లీ పోలీసు ప్రతినిధి సంజయ్ త్యాగి ధ్రువీకరించారు.

పేలుడుకు కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.

దిల్లీ పేలుడు

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో పేలుడు సంభవించింది.

హోం మంత్రి అమిత్ షా ఏమన్నారంటే..

దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన పేలుడుపైకేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియాతో మాట్లాడారు.

"ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఈ పేలుడు ఘటనలో 8 మంది చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. పేలుడుకు గత కారణాలను త్వరలోనే కనుగొంటాం" అని ఆయన అన్నారు.

"పేలుడు గురించి తెలిసిన వెంటనే ప్రధాన మంత్రి ఫోన్ చేశారు. నేను ఇక్కడి నుంచి సంఘటన స్థలానికి వెళ్తున్నాను. రేపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమావేశం జరగనుంది."

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

అంతకుముందు హోంమంత్రి విడుదల చేసిన ప్రకటనలో, "ఈరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో దిల్లీ ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఐ-20 హ్యుందాయ్ కారులో పేలుడు జరిగింది" అని తెలిపారు.

"పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే, దిల్లీ క్రైమ్ బ్రాంచ్, దిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు 10 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ, ఎఫ్ఎస్‌ల్ టీమ్‌లు సమగ్ర దర్యాప్తును ప్రారంభిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలోని అన్ని సీసీటీవీ కెమెరాలు, ఇతర అన్ని అంశాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి" అని పేర్కొన్నారు.

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

సాయంత్రం 6.52 గంటల సమయంలో : దిల్లీ పోలీస్ కమిషనర్

దిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా మీడియాతో మాట్లాడుతూ, " సాయంత్రం సుమారు 6.52 గంటల సమయంలో, ఎర్రకోట మెట్ర స్టేషన్ వద్ద రెడ్ లైట్ వైపు వచ్చి ఆగిన ఒక వాహనంలో పేలుడు జరిగింది. ఆ సమయంలో కారులో పాసింజర్స్ కూడా ఉన్నారు" అని అన్నారు.

"ఆ పేలుడుతో చుట్టుపక్కల వాహనాల కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందగానే దిల్లీ పోలీస్, ఎఫ్ఎస్ఎల్, ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీ టీమ్స్ ఇక్కడకు చేరుకున్నాయి. పరిస్థితి అంచనా వేస్తున్నాం. పేలుడు గురించి దర్యాప్తు చేస్తున్నాం. దీనికి కారణం ఏంటో దర్యాప్తు తర్వాత త్వరలోనే చెబుతాం."

"ఈ పేలుడులో కొందరు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. పరిస్థితిని అంచనా వేస్తున్నాం. కాసేపట్లో మీకు బాధితుల సంఖ్య చెబుతాం. పరిస్థితిని రెగ్యులర్‌గా మానిటర్ చేస్తున్నాం. హోంమంత్రికి రెగ్యులర్‌గా బ్రీఫ్ చేస్తున్నాం. టైమ్ టు టైమ్ మొత్తం సమాచారం ఇస్తున్నాం. ఏం జరిగిందనేది త్వరలోనే తెలియజేస్తాం" అని పోలీసు కమిషనర్ అన్నారు.

సీఆర్‌పీఎఫ్ డీఐజీ

ఫొటో సోర్స్, YEARS

‘‘తొందరపాటే అవుతుంది’’

పేలుడు సంభవించినట్లు వార్తలు వచ్చిన తరువాత ఏడు అగ్నిమాపక ఇంజన్లను ఎర్రకోట మెట్రో స్టేషన్ కు పంపినట్లు దిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ పేలుడులో ఎంతమంది గాయపడ్డారన్నది ఇంకా సమాచారం లేదు.

ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడుపై సీఆర్పీఎఫ్ డీఐజీ మాట్లాడుతూ ఈ విషయంలో ఇప్పుడే ఏదైనా చెప్పడం తొందరపాటేనన్నారు.

ఈ ఘటనపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ. ‘‘ఇప్పటికైతే ఏమీ తెలియదు. ఈ విషయంపై మాట్లాడటం తొందరపాటే’’ అన్నారు.

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం

దిల్లీ పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు.

ఈ పేలుడులో తమ ఆప్తులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

దిల్లీ పేలుడు, కారు పేలుడు, ఎర్రకోట

పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి మోదీ సమీక్షించినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. హోంమంత్రితో అమిత్ షాతో మోదీ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

దేశ రాజధానిలో పేలుడు ఘటనపై హోం మంత్రి అమిత్ షా దిల్లీ పోలీస్ కమిషనర్‌, ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌తో మాట్లాడినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. వివిధ ఏజెన్సీలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సూచించినట్లు పేర్కొంది.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, దిల్లీ పోలీసులు సమన్వయంతో దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించినట్లు ఏఎన్ఐ తెలిపింది.

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

పేలుడు ఘటనపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.

"దిల్లీలోని ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటన బాధాకరమని, తీవ్ర ఆందోళన కలిగించింది" అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

దిల్లీ పేలుడు, ఎర్రకోట, కారు పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కారు పేలుడుపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు.ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్రంగా, తక్షణమే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులు కోలుకోవాలని ఆకాంక్షించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)