విరాట్ కోహ్లీ: ఈ ‘యంత్రం’ పరుగు మళ్లీ మొదలైందా

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ కోహ్లీ... ఈ ‘పరుగుల యంత్రం’ మళ్లీ పూర్తి ఫామ్‌లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

నేడు శ్రీలంక మీద ఆడిన తీరును చూస్తే ఒక నాటి కోహ్లీ ‘దూకుడు’ కనిపించింది. ఈ రోజు ఆడిన షాట్స్, కొట్టిన సిక్సులు చూసిన వారికి పాత కోహ్లీ గుర్తుకు వచ్చి ఉంటాడు.

విరాట్ కోహ్లీ ఈ ఏడాది రెండోసారి సెంచరీ కొట్టాడు.

శ్రీలంక మీద 3వ వన్డేలో సెంచరీ చేయడం ద్వారా వన్డేలలో 46 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. దీంతో మొత్తం మీద అన్ని ఫార్మెట్లలో కలిపి కోహ్లీ సెంచరీల సంఖ్య 74కు చేరుకుంది.

మూడో వన్డేలో 85 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 10 ఫోర్లు ఒక సిక్సు కొట్టాడు.

కోహ్లీ గత నాలుగు ఇన్నింగ్సుల్లో మూడు సెంచరీలు చేయడం గమనార్హం.

మొత్తం మీద 110 బంతుల్లో 166 పరుగులు చేశాడు కోహ్లీ. ఇందులో 13 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. ఓవర్లు పూర్తి అయ్యే వరకు ఆడి నాటౌట్‌గా నిలిచాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్ నమోదైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

25 బంతుల్లో 66

విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతో మైదానం నలుమూలలా షాట్స్ కొట్టాడు.

సెంచరీ చేసే వరకు ఒక విధంగా ఆడిన కోహ్లీ ఆ తరువాత టీ20 ఫార్మెట్‌లోకి వెళ్లిపోయాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. 25 బంతుల్లో 66 పరుగులు తీశాడు. ఇందులో 3 ఫోర్లు 7 సిక్సులు ఉన్నాయి.

ఇందులో ఒక హెలికాప్టర్ షాట్ కూడా ఉండటం విశేషం. సాధారణంగా హెలికాప్టర్ షాట్ అనేది ధోనీ ట్రేడ్ మార్క్.

ప్రపంచంలోనే ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డ్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉంది. వన్డేలు, టెస్టులలో సచిన్ 100 సెంచరీలు చేశాడు. 51 టెస్టు సెంచరీలు, 49 వన్డే సెంచరీలున్నాయి.

ఇప్పుడు వన్డేలలో 46 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ మరొక నాలుగు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేసినవాడు అవుతాడు.

టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీ చాలా వెనుకబడి ఉన్నాడు. ప్రస్తుతం టెస్టులో కోహ్లీ 27 సెంచరీలు మాత్రమే చేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

‘రన్ మెషిన్’ మళ్లీ ఆరంభం

విరాట్ కోహ్లీని క్రికెట్ అభిమానులు ‘రన్ మెషిన్’ అంటే పరుగుల యంత్రంగా పిలుస్తుంటారు.

ఈ ‘యంత్రం’ పరుగు మళ్లీ మొదలైందంటూ సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.

2019లో నవంబరులో బంగ్లాదేశ్ మీద చేసిన టెస్టు సెంచరీ తరువాత సుమారు మూడేళ్ల పాటు విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేదు. చాలా కాలం పాటు ఫాంలో లేక పరుగులు చేయడానికి కోహ్లీ ఇబ్బంది పడ్డాడు.

ఫాంలో లేని కోహ్లీని ఇంకా ఎందుకు టీంలో ఉంచుతున్నారంటూ చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఆ కాలంలోనే కోహ్లీకి కెప్టెన్సీ కూడా దూరమైంది.

మొత్తానికి విరాట్ కోహ్లీ గత ఏడాది తిరిగి తన ఫాం అందుకున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ మీద సెంచరీ చేయడం ద్వారా తన సత్తాను చాటాడు.

ఆ తరువాత ఈ ఏడాది బంగ్లాదేశ్ మీద ఒక సెంచరీ, శ్రీలంక మీద రెండు సెంచరీలు బాదాడు.

దీంతో 2023 కోహ్లీ సంవత్సరం అవుతుందని క్రికెట్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)