వరద నీటిలో ఖైదీల తరలింపు
వరద నీటిలో ఖైదీల తరలింపు
శ్రీలంకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనురాధపుర జైలులోని ఖైదీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జైల్లోకి వరద నీరు ముంచెత్తడంతో ఖైదీలను అత్యవసరంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డిటెన్షన్ సెంటర్లకు తరలించినట్లు శ్రీలంక జైళ్ల శాఖ వెల్లడించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
శ్రీలంక పోలీసుల ఆధ్వర్యంలో ఛాతీ లోతు నీటిలో నడుచుకుంటూ ఖైదీలు పడవ ఎక్కుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

ఫొటో సోర్స్, UGC
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









