ఉత్తరాఖండ్: ‘‘మా ఇళ్లన్నీ కూలగొట్టేస్తే మేం ఎక్కడికి వెళ్లాలి?’’ అంటున్న హల్ద్వానీ మహిళలు

వీడియో క్యాప్షన్, రైల్వే స్థలాన్ని ఖాళీ చేయాలన్న ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
ఉత్తరాఖండ్: ‘‘మా ఇళ్లన్నీ కూలగొట్టేస్తే మేం ఎక్కడికి వెళ్లాలి?’’ అంటున్న హల్ద్వానీ మహిళలు

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ బస్తీలో జనాలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. తమ ప్రార్థనలు ఫలించాయన్నారు.

బస్తీని ఖాళీ చేయించటం మీద సుప్రీంకోర్టు స్టే తర్వాత కనిపించిన దృశ్యాలివి.

ఇక్కడి ఇరుకైన గల్లీలో నివసించే జాహిదా మనసులో అనుమానాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు.

ఒకవేళ తమను వెళ్లగొడితే, పిల్లలను తీసుకొని ఎక్కడికెళ్లాలనేది వారిని వేధిస్తున్న ప్రశ్న.

‘‘అన్నీ సమస్యలే మాకు. ఈ ఇళ్లన్నీ కూలగొట్టేస్తే మేం ఎక్కడికి వెళ్లాలి? సమస్యలున్నా ఎలాగోలా బతకుతాం. చచ్చిపోలేం కదా. మా మానాన మమ్మల్ని వదిలెయ్యండి. ఇక్కడే ఉండనివ్వండి. అంతే’’ అని జాహిదా బీబీసీతో వ్యాఖ్యానించారు.

ఉత్తరాఖండ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)