రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్ట్‌పై దాడి..అసలేం జరిగింది?
రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్ట్‌పై దాడి..అసలేం జరిగింది?
మహారాష్ట్రలోని పుణెకు సంబంధించిన ఈ వీడియో గత కొన్నిరోజులుగా పతాక శీర్షికల్లో నిలుస్తోంది. రిపోర్టింగ్ చేస్తున్న ఒక మహిళా జర్నలిస్టుపై దాడి జరగడమే దానికి కారణం.
ఆమె పేరు స్నేహా బార్వే. ఆమె ఒక స్థానిక న్యూస్ చానల్లో పనిచేస్తున్నారు.
మంచర్ మార్కెట్ కమిటీ ఏరియాలో ఆక్రమణలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై ఆమె రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది.
ఈ ఘటన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో స్నేహా బార్వే, ఆమె సహోద్యోగి మంచర్ మార్కెట్ కమిటీ పరిసరాల్లో అక్రమ నిర్మాణ కార్యకలాపాల గురించి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఇది జరిగిందని, 8 నుంచి 10 మంది పురుషులు అక్కడికి వచ్చి కర్రలతో స్నేహపై దాడి చేశారని చెప్పారు.










