మను భాకర్: షూటింగ్‌లో ఒలింపిక్ మెడల్ గెలిచిన భారత తొలి మహిళ
పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించారు.
మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని గెలుపొందారు.
ఒలింపిక్స్ పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.
10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్ గెలిచిన తొలి పతకం కూడా ఇదే.

ఫొటో సోర్స్, Getty Images
మను సాధించిన ఈ పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు అన్ని ఒలింపిక్స్‌లలో కలిపి షూటింగ్ ఈవెంట్‌లో అయిదు పతకాలు చేరాయి.
ఆదివారం ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్నారు.
దక్షిణ కొరియా ప్లేయర్లు జిన్ యే ఓమ్, యేజి కిమ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణం, రజత పతకాలను సాధించారు.
పూర్తి వివరాలకు పై వీడియో చూడండి
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









