సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ వైదొలగడం భారత్‌కు నష్టమా?

వీడియో క్యాప్షన్,

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో తీవ్రవాదుల దాడి జరిగిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారతదేశం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.

పాకిస్తాన్‌తో దౌత్య కార్యకలాపాలను తగ్గించడం, సరిహద్దును మూసివేయడం, సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం తదితర నిర్ణయాలు తీసుకుంది.

అయితే, పాకిస్తాన్ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పాకిస్తాన్ గగనతలాన్ని ఇండియా ఉపయోగించుకోలేదు. దీంతోపాటు 1972 నాటి సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అసలేంటి సిమ్లా ఒప్పందం? అందులో ఏముంది? అనేది ఈ వీడియోలో చూద్దాం..

సిమ్లా ఒప్పందం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)