ఫేస్‌బుక్, ట్విటర్‌లలో గ్యాస్ బుకింగ్ సదుపాయం

ఫొటో సోర్స్, IOCL/Facebook
ఫోన్ కాల్, ఎస్‌ఎంఎస్, ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకునే సదుపాయం ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. వీటికి అదనంగా ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విటర్‌లో కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీల్) మొట్టమొదటిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫేస్‌బుక్, ట్విటర్ వినియోగం విస్తృతం కావడంతో ఐఓసీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా ఇలా బుక్ చేసుకోవచ్చు!
ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి.
ఆ తర్వాత ఐఓసీఎల్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ indianoilcorplimited కోసం సెర్చ్ చేయాలి.
indianoilcorplimited లింక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఆ పేజీకి కుడివైపు బాక్సులో 'బుక్ నౌ' అనే ఆప్షన్ ఉంటుంది.
దానిపై క్లిక్ చేసి, పేరు, ఈమెయిల్, ఎల్‌పీజీ నెంబర్ ఇస్తే చాలు. గ్యాస్ బుక్ అయిపోతుంది.
ఆన్‌లైన్ ద్వారా కూడా డబ్బులు చెల్లించొచ్చు.

ఫొటో సోర్స్, facebook/Iocl
ట్విటర్ ద్వారా బుకింగ్ ఇలా!
మీ ట్విటర్ హ్యాండిల్‌లో @indanerefill సెర్చ్ చేయండి.
తొలిసారి బుక్ చేస్తున్నట్లయితే, ముందుగా మీ ఎల్‌పీజీ ఐడీ, ఈమెయిల్ వివరాలతో రిజిస్ట్రర్ చేసుకోవాలి.
ఆ తర్వాత సిలెండర్ బుక్ చేసుకునేందుకు ఎల్‌పీజీ నెంబర్, ఈమెయిల్‌తో @indanerefillకి ట్వీట్ చేయాలి.
అంతే. మీ సిలెండర్ బుక్ అయిపోయినట్లే!
ప్రస్తుతం ఐఓసీల్ వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. త్వరలోనే హెచ్‌పీ, భారత్ గ్యాస్ సంస్థలు కూడా వినియోగదారులకు ఈ సేవ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








