మే డే ఎలా మొదలైంది? కార్మిక దినోత్సవం చరిత్ర ఏమిటి?
మే 1.. అంటే 'మేడే'. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని 'లాయల్టీ డే'గా వ్యవహరిస్తున్నారు.
చాలా దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.మే 1.. అంటే 'మేడే'. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని 'లాయల్టీ డే'గా వ్యవహరిస్తున్నారు.
కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.
ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటుచేసుకున్నాయి
ఇవి కూడా చదవండి:
- మే డే - అంబేడ్కర్: "మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?"
- మే డే: కార్మికులు ఏ దేశాల్లో ఎక్కువ సేపు పనిచేస్తున్నారు?
- ఐటీ ఉద్యోగిని జాబ్ నుంచి తీసేస్తే ఏం చేయాలి?
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతుందా-
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది- - BBC News తెలుగు
- ఆంధ్రప్రదేశ్- విశాఖలో రుషికొండను గ్రీన్ మ్యాట్-తో కప్పేయడం వెనుక మతలబు ఏంటి- - BBC News తెలుగు
- ఉద్యోగం కోసం చూస్తున్నారా..- అయితే ఇక్కడ మీకు దొరకొచ్చు
- ఎంఎన్ఆర్ఈజీఏ: 'ఈ పథకం వల్లే ఇల్లు నడుస్తోంది, ఇది కూడా లేకపోతే మా పరిస్థితి ఏంటో తెలీదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)