You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
1. చార్లెస్ శోభరాజ్: పదేళ్లలో 20 మర్డర్లు, 5కిపైగా దేశాల్లో హత్య కేసులు, 4 దేశాల జైళ్ల నుంచి పరారీ.. ఎవరీ 'బికినీ కిల్లర్'?
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించింది.
శోభరాజ్ వయసును దృష్టిలో ఉంచుకుని అక్కడి సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. విడుదల చేసిన 15 రోజుల్లోగా ఆయన ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లాలని ఆదేశించింది.
ప్రస్తుతం శోభరాజ్‌కు 78 ఏళ్లు. గుండె జబ్బుతో బాధపడుతున్నారు.
1975లో నేపాల్ రాజధాని కఠ్మాండూలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేసిన కేసులో శోభరాజ్ 2003 నుంచి నేపాల్‌లో జైలులో ఉన్నారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
2. కోవిడ్-19 బీఎఫ్7: భారత్‌లోనూ ముప్పు తప్పదా.. ఇప్పుడు ఏం చేయాలి?
చైనాలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపై గత రెండు, మూడు రోజులుగా భారత్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ముందెన్నడూ లేని స్థాయిలో చైనాలో కరోనావైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 80 కోట్లకు పెరిగే అవకాశముందని అంచనాలు వస్తున్నాయి.
చైనాతోపాటు దక్షిణ కొరియా, జపాన్‌లలోనూ కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
3. బీపీడీ: పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవడానికి కారణం ఇదేనా?
''బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ) గురించి తెలుసుకున్నప్పుడు, నేను ఎప్పటికీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేనేమోనని అనిపించింది''అని 21 ఏళ్ల మాయి భావించారు. ఆమెకు బీపీడీ ఉందని ఈ ఏడాది మొదట్లో వైద్యులు నిర్ధారించారు.
ఇలా బీపీడీ సోకినవారిలో చాలా మంది సోషల్ మీడియా వేదికగా దీని గురించి మాట్లాడుతున్నారు.
#bpdisorder హ్యాష్‌టాగ్‌తో టిక్‌టాక్‌లో వీరు వీడియోలు చేస్తున్నారు. ఈ వీడియోల ద్వారా చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కొంతమంది సరదాగా తమ కథలు చెబుతున్నారు.
అయితే, ఈ కథలన్నింటిలోనూ కనిపించే విషయాలు ఏమిటంటే ''హార్ట్‌బ్రేక్'', ''టాక్సిక్ రిలేషన్‌షిప్స్''.
సోషల్ మీడియాలో బీపీడీ గురించి మాట్లాడుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైందని ఎడిన్‌బరా యూనివర్సిటీ ప్రొఫెసర్, సైకియార్టిస్టు డాక్టర్ లియానా రొమానిక్ చెప్పారు. నేటి యువతలో దీనిపై అవగాహన పెరుగుతోందని ఆమె వివరించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
4. తల్లి గర్భంలోని ప్లాసెంటా నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్‌తో బిడ్డను బతికించారు
తల్లి గర్భంలోని ప్లాసెంటా నుంచి సేకరించిన మూలకణాల(స్టెమ్‌సెల్స్)సాయంతో ప్రపంచంలోని తొలిసారి ఒక బిడ్డ ప్రాణాలు కాపాడగలిగామని ఒక గుండె శస్త్రచికిత్స నిపుణుడు వెల్లడించారు.
బ్రిస్టల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ మాసిమో క్యాపులో ఈ చికిత్స చేశారు.
బాబు ఫిన్లే గుండెలో లోపం ఉన్నట్లు ఆయన గుర్తించారు.
దీన్ని సరిచేసేందుకు ఒక స్టెమ్‌సెల్ పట్టీని ఆయన అభివృద్ధి చేశారు. ఇది మెరుగ్గా పనిచేసిందని ఆయన చెప్పారు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
5.నిరుద్యోగులు రూ. లక్ష నుంచి 50 లక్షల వరకు రుణం పొందడం ఇలా..
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి భరోసా కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(PMEGP).
స్వశక్తితో నిలబడాలనుకునే నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లక్ష రూపాయల నుంచి 50 లక్షల వరకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.
ఈ రుణంలో కేంద్ర ప్రభుత్వం 35 శాతం వరకు రాయితీ ఇస్తోంది.
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే తపన ఉన్న ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే పథకం ఇది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)