You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్‌పై ‘హత్యాయత్నం’.. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ తగిలినట్లు పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) జనరల్ సెక్రటరీ అసద్ ఉమర్ తెలిపారు.
పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలా వద్ద గల అల్లాహ్‌వాలా చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఎంపీ ఫైజల్ జావేద్ కూడా గాయపడినట్లు బీబీసీ ఉర్దూ తెలిపింది. మొత్తం మీద ఈ ఘటనలో నలుగురు గాయపడినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక వ్యక్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాల్పులు జరిపింది ఆ వ్యక్తేనా కాదా అనేది ఇంకా నిర్ధరించలేదు.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌ను లాహోర్‌కు తరలించినట్లు పీటీఐ జనరల్ సెక్రటరీ వెల్లడించారు.
ఇమ్రాన్ ఖాన్ నిరసన ర్యాలీ
పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబరు 28న ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ ప్రారంభించారు. ఆరు రోజులుగా 'ఫ్రీడం మార్చ్' జరుగుతోంది.
ప్రణాళిక ప్రకారం రేపటికి ఆయన ర్యాలీ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. కానీ షెడ్యూల్‌లో ఆలస్యం అవుతుందని పీటీఐ జనరల్ సెక్రటరీ తెలిపారు.
ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు.
నేటితో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ 7వ రోజుకు చేరుకుంది. ‘మా కార్యకర్తల్లో కొందరు గాయపడ్డారు. ఒకరు వీర మరణం పొందినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందరి కోసం ప్రార్థిద్దాం’ అని ఎంపీ ఫైజల్ జావేద్ ఒక వీడియోలో అన్నారు.
ఆ వీడియోను పీటీఐ పార్టీ ట్వీట్ చేసింది.
ఖండించిన పాకిస్తాన్ ప్రధాని
ఇమ్రాన్ ఖాన్ మీద దాడిని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఖండించారు.
తక్షణమే ఘటన మీద నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి, పంజాబ్ చీఫ్ సెక్రటరీ, ఐజీలను ఆయన కోరారు.
చైనా పర్యటన తరువాత నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని కూడా ఆయన వాయిదా వేసుకున్నారు.
రెండు రోజుల పర్యటన తరువాత చైనా నుంచి నేడు పాకిస్తాన్‌కు చేరుకున్నారు షాబాజ్ షరీఫ్.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు: మద్యం, డబ్బు ఏరులై పారుతోన్న ఈ నియోజకవర్గంలో... ఏళ్లుగా నీళ్లు రావడం లేదెందుకు?
- కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)