బ్రిటన్ ప్రధాని: ‘రిషి సునాక్ సరైన వ్యక్తి, కానీ పార్టీలోని రాజకీయాలను ఎదుర్కోగలరా?’ - బ్రిటన్‌లోని భారతీయుల మనోగతం
బ్రిటన్ రాజకీయ పరిణామాలను అక్కడి ప్రజలు ఎలా చూస్తున్నారు?
కొత్త ప్రధాని ఎవరు కావచ్చని వారు భావిస్తున్నారు?
బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ బ్రాడ్‌ఫోర్డ్‌లో కొందరు దక్షిణాసియా ప్రజలతో మాట్లాడారు.
దీన్ని మేం ముందే ఊహించాం - పూనమ్ ఆనంద్
మేమింకా షాక్‌లోనే ఉన్నాం. కానీ ఈ వార్తలో.. ఆశ్చర్యమైతే ఏం లేదు. ఇప్పుడిక్కడ చాలా అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పుడు ఇక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభంలో ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాల్సింది. దీన్ని ముందే మేం ఊహించాం. ఎందుకంటే ఆమె నిజంగానే సరిగ్గా పనిచేయడం లేదు.

రిషి సునాక్ సరైన వ్యక్తి - సందీప్ గుప్తా
రిషి సునాక్ ప్రధాని అవుతారని అనుకుంటున్నాను. కోవిడ్ సమయంలో ఆయన చాలా బాగా పనిచేశారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కోవిడ్ తర్వాత బ్రిటన్ ఆర్థిక పరిస్థితి కుదుటపడింది. ఆయనే సరైన వ్యక్తి. అందుకే ఆయనే ప్రధాని కావాలని అనుకుంటున్నాను.

రిషి ఓ మంచి ప్రధాని అవుతాడు - శశి శ్యామా
ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటిష్ ఆర్థిక రంగంమీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మాకిప్పుడు అవసరం. ఒకవేళ రిషికి ప్రధానిగా అవకాశం ఇస్తే ఓ మంచి ప్రధానిగా నిలబడతారని ఆశిస్తున్నాను.

పరిస్థితులను చక్కదిద్దేవాళ్లు కావాలి - కమల్ శర్మ
పెన్నీ మోర్డంట్, రిషి సునాక్ మధ్యే పోటీ అని అనుకుంటున్నారు. పాత వాళ్లు ఈ పోటీలోకి దిగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకుంటే ఇప్పుడున్నది చాలా ఇబ్బందకర పరిస్థితి. ఎవ్వరూ ఓ పెద్ద సాహసం చేసి కన్జర్వేటివ్ పార్టీని ముందుకు నడిపించాలనుకోరు. వాళ్లకిప్పుడు యువరక్తం అవసరం. ఛాలెంజ్‌లను స్వీకరించి పరిస్థితులను చక్కదిద్దేవాళ్లు కావాలి.

పార్టీలోని రాజకీయాలను రిషి ఎదుర్కోవాలి - ముసర్వా మాలిక్
కన్జర్వేటివ్ పార్టీలోని అంతర్గత రాజకీయాలను ముందుగా రిషి సునాక్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. బోరిస్ అభిమానులను కూడా ఆయన ఎదుర్కోవాల్సి రావచ్చు.

ముగ్గురూ స్ట్రాంగ్ కేండిడేట్లే - ఓవైస్ రాజపుత్
రిషి ఓ బలమైన అభ్యర్థి. మిస్ పానీ, బోరిస్, రిషీ ముగ్గురూ పోటీలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీళ్లు ముగ్గురూ స్ట్రాంగ్ కేండిడేట్లే. అయితే రిషీకే ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తున్నాను.
ఇవి కూడా చదవండి:
- ఒక్కసారిగా గుండెపోటు, కుప్పుకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు.. ఇంత సడెన్‌గా చనిపోవడానికి కారణాలేంటి?
- డెంగీ రోగికి ప్లాస్మాకు బదులు ఆరెంజ్ జ్యూస్ ఎక్కించారు
- బ్రిటన్: లిజ్ ట్రస్ స్థానంలో ప్రధాని రేసులో ఎవరెవరున్నారు?
- సెక్స్ లేని వైవాహిక జీవితాలతో ఈ తరం సతమతం... ఎందుకిలా?
- 'ఓరి దేవుడా' మూవీ రివ్యూ: బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?
- ఆంధ్రప్రదేశ్: రాజకీయాలను ఇంకెంత దిగజారుస్తారు? -వీక్లీ షో విత్ జీఎస్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)