బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరంలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర మందిరం, ఇతర విశేషాలు..
బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ అట్టహాసంగా మొదలయ్యాయి.
తొలిరోజు భారతీయ మహిళల హాకీ జట్టు ఘానాపై ఘన విజయం సాధించింది.
ఇక మహిళల టీ-20 క్రికెట్ మ్యాచ్‌లో భారత్‌ను ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఓడించింది.
32 బౌట్ల బాక్సింగ్ మ్యాచ్‌లో శివ థాప పాకిస్తానీ బాక్సర్ సులేమాన్ బలోచ్‌పై 5-0 స్కోర్‌తో విజయం సాధించారు.
ఇక.. ఈ క్రీడలు జరిగే బర్మింగ్‌హామ్ నగరం చాలా సందడిగా ఉంది.
క్రీడాభిమానులు, పర్యటకులు అక్కడికి పోటెత్తుతున్నారు.
ఆ నగరం విశేషాలేంటో వివరిస్తున్నారు బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్.

ఇదే తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర (యూకే తిరుపతి బాలాజీ) మందిరం. దీన్ని 2006లో ప్రారంభించారు. దీన్ని యూరప్‌లోనే అతిపెద్ద హిందూ మందిరంగా చెబుతారు.
బ్రిటన్, యూరప్ నుంచి ఏటా దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు ఈ గుడికి వస్తూ ఉంటారు.
బాల్టీ ట్రయాంగిల్
బాల్టీ ట్రయాంగిల్. బర్మింగ్‌హామ్‌లోనే అత్యంత పాప్యులర్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇది.
బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రాచీనమైన బాల్టీ రెస్ట్రాంట్లను ఇక్కడ మనం చూడొచ్చు. 1970లలో బర్మింగ్‌హామ్‌కు వలస వచ్చిన పాకిస్తానీ, కశ్మీరీ ప్రజలు ఇక్కడ రెస్ట్రాంట్లు తెరిచారు. అలా బాల్టీకి ప్రజాదరణ బాగా పెరిగింది.
దేశీ పబ్
మరో ప్రత్యేకమైన ఆకర్షణ బర్మింగ్‌హాంలోని దేశీ పబ్.
దేశీ పబ్ అంటే మరేదో కాదు. భారతీయల యాజమాన్యంలోని సంప్రదాయ ఇంగ్లిష్ పబ్బులే. బ్రిటిష్ పబ్బుల్లో సాధారణంగా దొరికే ఫూడ్‌కు బదులు వీడిలో పంజాబీ ఫూడ్ సర్వ్ చేస్తారు.
1960ల్లో భారత్ నుంచి బ్రిటన్‌కు జనం భారీగా వలస వచ్చిన సమయంలో దేశీ పబ్ అనే కాన్సెప్ట్ మొదలైంది. అయితే, ఈరోజు బర్మింగ్‌హామ్ సంస్కృతిలో, సమాజంలో ఇవి విడదీయరాని భాగంగా మారాయి.
బ్రిటిష్ పబ్స్ 40-50 ఏళ్ల క్రితం, భిన్న జాతుల ప్రజలు ఇక్కడికొచ్చి తాగడానికి అనుకూలంగా ఉండేవి కాదు. తర్వాత భారతీయ మైనారిటీలు ఎక్కువగా దేశీ పబ్స్‌కు వస్తూ - కార్డ్స్ వంటివి ఆడటం, కుండ నిండా మాంసాన్ని వండి అందరికీ వడ్డించడం వంటి చేస్తుండటంతో దేశీ పబ్స్ హవా మొదలైంది.
ఇప్పుడు దేశీ పబ్స్‌లో మీరు అన్ని నేపథ్యాల ప్రజలనూ చూడొచ్చు. విభిన్న విశ్వాసాలు, భిన్నమైన ఆహారపుటలవాట్లు ఉన్నవారు కలిసిమెలసి తాగడం, భారతీయ వంటకాలను ఆస్వాదించడం ఇక్కడ కనిపిస్తాయి.
వీటిన్నిటితో కలగలిసిన బర్మింగ్‌హామ్ నగరం పర్యటకులందరికీ మరిచిపోలేని అనుభూతిని అందిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపుల వల్లే ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా?
- బీజీఎంఐ: పబ్జీకి ప్రత్యామ్నాయంగా మారిన ఈ గేమ్‌ను భారత్ ఎందుకు బ్లాక్ చేసింది?
- ఒబేసిటీ: భారతదేశపు చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయులు, కారణాలు ఇవే
- ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
- దేశంలో ఒంటరి మహిళల సంఖ్య ఎందుకు పెరుగుతోంది...వీరికి పెళ్లి మీద మనసు విరగడానికి కారణాలు ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



