You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Man vs Horse: 29 గంటలపాటు నిద్ర లేకపోయినా.. గుర్రాల కంటే వేగంగా పరిగెత్తి రేసులో గెలిచాడు..
గుర్రాల కంటే వేగంగా పరిగెత్తి ఓ రన్నర్ రేసులో విజేతగా నిలిచాడు. ‘‘మ్యాన్ వర్సెస్ హార్స్’’ పేరుతో బ్రిటన్‌లో ఈ రేసు నిర్వహించారు.
ఈ రేసులో పాల్గొనేందుకు అట్లాంటిక్ దీవులైన టెన్‌ఫైర్ నుంచి 37 ఏళ్ల రికీ లైట్‌ఫూట్ వచ్చారు. ప్రయాణం వల్ల 29 గంటలపాటు ఆయన నిద్ర పోలేదు కూడా.
1980ల నుంచీ ఏటా ఈ రేసు నిర్వహిస్తున్నారు. అయితే, గుర్రాలను ఓడించి ఇలా గెలిచిన వారిలో రికీ మూడో వ్యక్తి.
బ్రిటన్ కాల మానం ప్రకారం, శనివారం ఉదయం నాలుగు గంటలకు ఆయన వేల్స్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పోవైస్‌కు 9 గంటలకు చేరుకున్నారు. 11 గంటలకు ఈ రేసు మొదలైంది.
గీత దాటిన తర్వాత ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తుండే ఆయనకు గెలిచానో లేదో తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనుషులకు వేరే, గుర్రాలకు వేరే మార్గాలున్నాయి.
22.5 మైళ్ల(36 కి.మీ.) రేసులో వెయ్యి మంది రన్నర్లు, 50 మంది గుర్రాలపై 2.22.23. గంటలపాటు పరిగెత్తి ఆయన విజయం సాధించారు. దీంతో 3,500 పౌండ్లు (రూ.3.32 లక్షలు) నగదును ఆయన గెలిచి ఇంటికి తీసుకెళ్లారు.
‘‘ఈ రేసులో గుర్రాలపై గెలవడం చాలా గొప్పగా అనిపిస్తోంది’’ అని రేసులో గెలిచిన అనంతరం ఆయన చెప్పారు.
‘‘గెలిచిన వెంటనే మా పార్ట్‌నర్‌కు ఫోన్ చేశాను. గుర్రాలతో పోటీలో గెలిచానని చెప్పాను. దీంతో నువ్వు జోక్ చేస్తున్నావా? అని తను అడిగింది. లేదు.. లేదు.. అని నిజంగానే గెలిచానని చెప్పడంతో.. ఓరి దేవుడా అని తను అంది’’ అని ఆయన వివరించారు.
ఈ రేసులో గెలుస్తానని మొదట్నుంచీ తనపై తనకు నమ్మకముందని ఆయన అన్నారు.
‘‘గుర్రానికి గట్టి పోటీ ఇవ్వగలనని మొదట్నుంచీ అనిపించింది’’ అని ఆయన చెప్పారు.
‘‘నా జీవితంలో ఎప్పుడూ గుర్రంపై స్వారీ చేయలేదు. ఒకసారి బ్లాక్‌పూల్‌లో గాడిదపైకి ఎక్కాను’’ అని ఆయన వివరించారు. ఆయన ఫైర్‌ఫైటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు.
ఈ రేసులో హాయిగా రికీ విజయం సాధించారని రేస్ డైరెక్ట్ మైక్ థామస్ చెప్పారు.
2007లో చివరిసారిగా ఈ రేసులో ఒక వ్యక్తి విజయం సాధించారు. 2004లో తొలిసారి గుర్రంపై ఒక వ్యక్తి పైచేయి సాధించారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ గత రెండేళ్లపాటు ఈ రేసు నిర్వహించలేదు.
ఇవి కూడా చదవండి:
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- Viagra: మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే ‘వయాగ్రా’ను తయారుచేయడం ఎందుకంత కష్టం?
- కాథలిక్కుల్లో కులం సంగతేంటి? ఒక దళితుడు కార్డినల్ కావడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది?
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.