కీయెవ్ వీధుల్లో నాటు బాంబులు తయారు చేస్తున్న యుక్రెయిన్ మహిళలు

యుక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది. రష్యా దళాలు దాడి చేస్తూ ముందుకు సాగుతున్నాయి. యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంలో పోరాటం వీధుల్లోకి వచ్చింది.

గాజుసీసాలో పెట్రోల్, ఆల్కాహాల్ లాంటి మండే ద్రవాలను పోసి, కొంత మోటర్ ఆయిల్ కూడా కలుపుతారు. దీన్నే మోలోటోవ్ కాక్‌టెయిల్ అంటారు.

సీసాలోంచి బయటకు వేలాడేటట్టుగా ఒక గుడ్డ ముక్కను అందులో ఉంచుతారు. లోపల ఉన్న ద్రవాన్ని మెల్ల మెల్లగా గుడ్డ పీల్చుకుంటుంది. గుడ్డ ముక్క రెండో చివర మంట పెడితే ఈ మోలోటోవ్ కాక్‌టెయిల్ పేలుడు పదార్థంలా పనిచేస్తుంది.

ఇవి తయారుచేసుకోవడం సులభం కావడంతో క్రిమినల్స్, అల్లర్లకు పాల్పడేవారు, టెర్రరిస్టులు, ఒక్కోసారి ఆయుధ సామాగ్రి తక్కువగా ఉన్నప్పుడు ఆర్మీ కూడా వీటిని ఉపయోగిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)