కమెడియన్ దేశాధ్యక్షుడిగా ఎలా ఎదిగారు?

వీడియో క్యాప్షన్, కమెడియన్ దేశాధ్యక్షుడిగా ఎలా ఎదిగారు?

టీవీలో వచ్చే ఒక ప్రముఖ కామెడీ సీరీస్‌లో "యుక్రెయిన్ అధ్యక్షుడి"గా నటించారు వొలొదిమిర్ జెలెన్‌స్కీ. తెర మీద పాత్ర నడిచి వచ్చినట్టు, 2019 ఏప్రిల్‌లో ఆయన నిజంగానే ఆ దేశ అధ్యక్షుడయ్యారు.

ప్రస్తుతం, 4.4 కోట్ల జనాభాతో, పొరుగు దేశమైన రష్యా నుంచి సైనిక పరమైన ముప్పు ఎదుర్కుంటూ అత్యంత సున్నితమైన పరిస్థితుల్లో ఉన్న దేశానికి జెలెన్‌స్కీ నాయకత్వం వహిస్తున్నారు.

ఆయన నటించిన కామెడీ సీరీస్ పేరు "సర్వెంట్ ఆఫ్ ది పీపుల్". అందులో ఆయన అణకువతో ఉండే హిస్టరీ ప్రొఫెసర్ పాత్ర వేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఆ ప్రొఫెసర్ మాట్లాడిన ఒక వీడియో వైరల్ కావడంతో అనుకోకుండా ఆయన దేశాధ్యక్షుడవుతారు. అదొక కల్పిత కథ. యుక్రెయినియన్ రాజకీయాల పట్ల ఆ దేశ ప్రజలకు ఉన్న భ్రమలపై సంధించిన అస్త్రం.

ఈ సీరీస్ జెలెన్‌స్కీ పార్టీ పతాకగా మారింది. దేశంలో రాజకీయ ప్రక్షాళన చేస్తామని, తూర్పున శాంతి సాధిస్తామనే సందేశంతో జెలెన్‌స్కీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.

ప్రస్తుత యుక్రెయిన్ సంక్షోభం 44 ఏళ్ల జెలెన్‌స్కీని చిక్కులో పడేసింది. యుక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను "స్వతంత్ర భూభాగాలుగా" గుర్తించాలన్న రష్యా అధ్యక్షుడి నిర్ణయం, యుక్రెయిన్‌లో రష్యా సైనిక బలగాల కదలికలు.. జెలెన్‌స్కీని ఆందోళనకరమైన అంతర్జాతీయ వివాదం మధ్యలో నిలబెట్టాయి.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)