You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్రేకింగ్ న్యూస్: సైనిక చర్యను ప్రకటించిన పుతిన్, కీవ్‌లో వరుస పేలుళ్లు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో సైనిక చర్యను ప్రకటించారు. యుక్రెయిన్ మీద దాడిని ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కోరుతున్న సమయంలోనే టీవీ ప్రసంగంలో పుతిన్ ఈ ప్రకటన చేశారు.
కీవ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయని బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్ తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో సైనిక చర్యను ప్రకటించారు. యుక్రెయిన్ మీద దాడిని ఆపాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కోరుతున్న సమయంలోనే టీవీ ప్రసంగంలో పుతిన్ ఈ ప్రకటన చేశారు.
యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయని బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్ తెలిపారు.
యుక్రెయిన్, రష్యా సైన్యాలకు మధ్య ఘర్షణలు అనివార్యమని, ఏ క్షణంలోనైనా అది జరగవచ్చునని పుతిన్ పేర్కొన్నారు.
రష్యా చర్యలు ఆత్మరక్షణ చర్యలని పుతిన్ అన్నారు.
యుక్రెయిన్ సైనికుల తండ్రులు, తాతలు పోరాడకపోవటానికి కారణం.. నియో-నాజీలకు సాయం చేయటానికేనని యుక్రెయిన్ సైనికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
''న్యాయం, సత్యం'' రష్యా వైపు ఉన్నాయని కూడా పుతిన్ పేర్కొన్నారు.
ఎవరైనా రష్యా మీద దాడికి ప్రయత్నిస్తే తాము ''తక్షణమే'' ప్రతిస్పిందిస్తామని హెచ్చరించారు.
గురువారం ఉదయం టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో పుతిన్ మాట్లాడుతూ.. తూర్పు యుక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతంలో యుక్రెయిన్ సైనికులు ఆయుధాలు వదిలేసి వారి వారి ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఏ రక్తపాతానికైనా యుక్రెయిన్‌నే నిందించాల్సి ఉంటుందని ఆ దేశాన్ని హెచ్చరించారు.
యుక్రెయిన్ మీద దాడి చేయకుండా రష్యా సైన్యాన్ని ఆపాలని పుతిన్‌కు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు.
శాంతికి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే చాలా మంది జనం చనిపోయారన్నారు.
యుక్రెయిన్‌ను ఆక్రమించే ప్రణాళిక లేదు: పుతిన్
అయితే.. యుక్రెయిన్‌ను ఆక్రమించే ప్రణాళికేదీ తమ దేశానికి లేదని పుతిన్ తన టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు.
ఆ దేశంలో ప్రత్యేక సైనిక చర్యను ప్రకటిస్తూ మాట్లాడిన పుతిన్.. దేశాన్ని ఎవరు నడుపుతారో ఎంచుకునే స్వేచ్ఛ యుక్రెయిన్ ప్రజలకు ఉంటుందన్నారు.
మరిన్ని అప్‌డేట్స్ లైవ్ పేజీలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ సంక్షోభం: కొన్ని దేశాలు అమెరికాతో జత కట్టకుండా, రష్యా పక్షం వహిస్తున్నాయి ఎందుకు?
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- బ్రిటన్ను భయపెట్టిన భారత మేజిక్ మహారాజు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు.. పోలీసులు ఏం చెబుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)