‘ప్రపంచంలో హెచ్‌ఐవీని జయించిన మొట్ట మొదటి మహిళ ఈమే.. ఎలా సాధ్యమైందంటే..’
అమెరికాలోని ఒక రోగి ప్రపంచంలో హెచ్‌ఐవీ నుంచి పూర్తిగా బయటపడిన మూడవ వ్యక్తి, తొలి మహిళ అని డాక్టర్లు చెబుతున్నారు.
లుకేమియాతో బాధపడుతూ, దాని చికిత్సలో భాగంగా స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు ఆ మహిళ.
ఆమెకు స్టెమ్ సెల్ ఇచ్చిన దాతకు హెచ్‌ఐవీ వైరస్‌పై పోరాడే సహజ సామర్థ్యం ఉంది.
దీంతో స్టెమ్ సెల్ పొందిన ఆ మహిళ హెచ్ఐవీ నుంచి బయటపడ్డారని తేలింది.
గత 14 నెలలుగా ఆమెలో హెచ్ఐవీ లక్షణాలేమీ కనిపించలేదని గుర్తించారు.
అయితే, హెచ్ఐవీని పూర్తిగా నిర్మూలించేందుకు ఈ స్టెమ్ సెల్ చికిత్స అందరు రోగులకూ చేయడం కుదరకపోవచ్చని డాక్టర్లు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

