40 ఏళ్లుగా షార్క్‌లతో కలిసి ఈత కొడుతున్నా.. అవి మనుషుల్ని చంపి, రక్తం తాగేవి కావు

వీడియో క్యాప్షన్, 40 ఏళ్లుగా షార్క్‌లతో స్నేహం చేస్తున్నా.. అవి మనుషుల్ని చంపి, రక్తం తాగేవి కావు

జిమ్ అబెర్నెతీ ఒక ఎక్స్‌పర్ట్ డైవర్. గత 40 ఏళ్లుగా దాదాపు ప్రతి రోజూ బహమాస్‌లోని టైగర్ బీచ్‌ సమీపంలో ఆయన షార్క్‌లతో పాటు సముద్రంలో ఈత కొడుతున్నారు.

ఆయన సముద్రంలోకి వెళితే చాలు కనీసం 30 షార్క్‌లు ఆయన్ను చుట్టుముట్టేస్తాయి.

షార్క్‌లు అంటే మనుషుల్ని తినేసి, రక్తం తాగేసే భయంకరమైన జీవులుగా చూపిస్తుంటారని, నిజానికి అవి మనుషుల్ని ఏమీ చేయవని జిమ్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)