డ్యాన్స్‌తో విద్యుత్ ఉత్పత్తి.. అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ

వీడియో క్యాప్షన్, డ్యాన్స్‌తో విద్యుత్ ఉత్పత్తి.. అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ

మీరు సౌర విద్యుత్ గురించి, పవన విద్యుత్ గురించి వినే ఉంటారు కదా.. మరి డ్యాన్స్ విద్యుత్ గురించి విన్నారా?

బ్రిటన్‌లోని ఒక నైట్ క్లబ్.. తమ క్లబ్‌కు వచ్చి డ్యాన్స్ చేసే కస్టమర్ల శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్ తయారు చేస్తోంది.

ఇలా తయారు చేసిన విద్యుత్‌తో డాన్స్ క్లబ్‌లో ఏసీ నడపొచ్చు. ఈ విద్యుత్‌ను అవసరమైనప్పుడు వాడుకునేలా స్టోర్ చేసుకోవచ్చు కూడా.

బాడీహీట్ అని పిలుస్తున్న ఈ వ్యవస్థ 2022 నాటికి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనుంది.

దీని ద్వారా కాలుష్యాన్ని నియంత్రించి, వాతావరణ మార్పులను అరికట్టొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)