అఫ్గానిస్తాన్: ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’

వీడియో క్యాప్షన్, ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’

తాలిబాన్ ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్ బతుకు పోరాటం దుర్భరంగా మారింది.

10 లక్షల మంది చిన్నారులు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు.

విదేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి.

అఫ్గానిస్తాన్‌లో ఆరోగ్య వ్యవస్థ విదేశీ నిధులపై ఆధారపడి ఉంది.

హీరత్‌లో చాలామంది తమ పిల్లలను పోషించడానికి చేయరాని పనులు చేస్తున్నారు.

అఫ్గాన్‌లో పరిస్థితులు వర్ణించడానికి మాటలు రావు.

అఫ్గానిస్తాన్ ప్రజలను ఆదుకోవాల్సిన సమయం ఇది.

తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించాలా వద్దా అనే చర్చకు సమయం లేదు.

అఫ్గానిస్తాన్ నుంచి బీబీసీ ప్రతినిధి యోగితా లిమాయే అందిస్తున్న కథనం.

(పిల్లలను అమ్ముకుంటున్న ఘటనలపై బీబీసీ యూనిసెఫ్‌కు ఫిర్యాదు చేసింది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)