బంగ్లాదేశ్: ఇంత పొట్టి ఆవును ఎప్పుడైనా చూశారా

వీడియో క్యాప్షన్, బంగ్లాదేశ్: ఇంత పొట్టి ఆవును ఎప్పుడైనా చూశారా

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం 'రాణి' ఓ సెలబ్రిటీ అయిపోయింది. రాణిని చూడ్డానికి, పక్కనే నిల్చుని ఫొటోలు దిగడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు.

రాణి అంటే మరెవరో కాదు. అదొక 'భుట్టి ఆవు. అంటే భూటాన్ జాతి ఆవు. దాని వయసు రెండు సంవత్సరాలు. ఎత్తు కేవలం 51 సెం.మీ, బరువు 28 కిలోలు. ప్రస్తుతం రాణి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దగ్గర్లో ఉన్న చారీగ్రామ్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో ఉంది.

బంగ్లాదేశ్‌లో కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ, 15వేల మందికి పైగా జనం రాణిని చూడ్డానికి వచ్చారని స్థానిక మీడియా తెలిపింది.

ఈ ఫామ్ మేనేజర్ హసన్ హోలాదార్, రాణి పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు పంపారు. రాణి ప్రపంచంలోనే అతి చిన్న ఆవు అని ఆయన అంటున్నారు.

"నా జీవితంలో ఇలాంటి వింత చూడలేదు" అని ఈ బుజ్జి ఆవును చూడ్డానికి వచ్చిన రీనా బేగం బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)