You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ Vs న్యూజీలాండ్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నిబంధనలు ప్రకటించిన ఐసీసీ
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నిబంధనలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ - ఐసీసీ ప్రకటించింది.
ఐదు రోజుల్లో ఫలితం తేలకుండా, మ్యాచ్ డ్రా అయితే రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తామని ఐసీసీ వెల్లడించింది.
నిర్ణీత సమయంలో మ్యాచ్ పూర్తికాకపోతే, ఏవైనా అడ్డంకులు ఎదురైతే నష్టపోయిన ఆటను ఆరో రోజు ఆడిస్తామని వివరించింది.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలు కావడానికి ముందే 2018 జూన్‌లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో సమయం నష్టపోతేనే రిజర్వ్ డేను కేటాయిస్తారు.
జూన్ 23ను రిజర్వ్ డేగా నిర్ణయించారు.
రిజర్వ్ డేను ఉపయోగించుకోవాలా వద్దా అనేది మ్యాచ్ రెఫరీ నిర్ణయిస్తారు. అది కూడా ఐదో రోజు మ్యాచ్ చివరి గంటలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు.
ఐదు రోజుల మ్యాచ్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే మరో రోజు అదనంగా ఆటను కొనసాగించరు.
అలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ని డ్రాగా ప్రకటిస్తారు.
వచ్చే నెల 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజీలాండ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో తలపడబోతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)