లయన్ కింగ్‌ వీర్యకణాలతో పుట్టిన 'సింబా'

వీడియో క్యాప్షన్, లయన్ కింగ్‌ వీర్యకణాలతో పుట్టిన 'సింబా'

కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా జన్మించిన తొలి సింహపు పిల్ల సింగపూర్ జూలో ప్రధాన ఆకర్షణగా మారింది. జంతు ప్రదర్శనశాల సిబ్బంది 'సింబా' రాకను సంబరంగా జరుపుకుంటున్నారు.

దురదృష్టవశాత్తు సింబా తండ్రి ముఫాసాను ఎప్పటికీ కలుసుకోలేదు. వృద్ధ సింహం ముసాఫా నుంచి వీర్యం సేకరించిన తర్వాత దానిని బ్రతికించలేకపోయారు.

ముసాఫాకు పుట్టిన ఏకైక కొడుకు సింబా. ఈ వృద్ధ సింహం దూకుడు వైఖరి వలన ఎప్పుడూ ఆడ సింహాలతో సమాగమం అవ్వడంలో విజయవంతం కాలేదు.

దీంతో, ఆ సింహపు వారసత్వాన్ని కొనసాగించేందుకు జూ అధికారులు గతంలో ఎన్నడూ అవలంబించని విధానాన్ని ప్రయత్నించి చూడాలని నిర్ణయించుకున్నారు.. ఆ తరువాత ఏమైందో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)