జపాన్: ఇల్లు ఖాళీ చేయిస్తారనే భయంతో తల్లి మృతదేహాన్ని 10 ఏళ్లుగా ఫ్రిజ్‌లో దాచిన మహిళ

చనిపోయిన తన తల్లి మృతదేహాన్ని తన ఇంట్లోనే ఫ్రీజర్‌లో దాచి ఉంచిన ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

జపాన్‌లోని టోక్యోలో నివసిస్తున్న 48 ఏళ్ల యుమి యోషినో తల్లి పదేళ్ల కిందట చనిపోయారు. ఆమె చనిపోయారని తెలిస్తే తనను ఆ ఇల్లు ఖాళీ చేయమంటారనే భయంతో తల్లి మృతదేహాన్ని ఇన్నాళ్లుగా ఫ్రీజర్‌లో దాచిపెట్టారని స్థానిక మీడియా తెలిపింది.

గడ్డ కట్టుకుపోయిన యుమి తల్లి శరీరంపై బయటకి కనిపించే గాయాలేవీ లేవని పోలీసులు తెలిపారు.

ఆమె చనిపోయిన సమయం, కారణాలు తెలియలేదని అధికారులు చెప్పారు.

గత కొన్ని నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇటీవలే యుమి చేత ఆ ఇల్లు ఖాళీ చేయించారు.

తరువాత ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లినవారు ఫ్రీజర్‌లో ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు.

ఫ్రీజర్‌లో పట్టేందుకు వీలుగా శరీరాన్ని వంచి, లోపల కుక్కి పెట్టారని పోలీసులు తెలిపారు.

శుక్రవారం టోక్యోకు దగ్గర్లో ఉన్న చీబా నగరంలోని ఒక హోటెల్‌లో యోషినోను అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)