చలికాలంలో కే2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాలీలు

వీడియో క్యాప్షన్, చలికాలంలో కే2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాలీలు

కే2 పర్వతం ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన పర్వతం. ఎవరెస్ట్ శిఖరం కంటే కే2 ఎత్తు కేవలం 200 మీటర్లే తక్కువ. ఇది పాకిస్తాన్-చైనా సరిహద్దుల్లో కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉంది. 8,611 మీటర్ల ఎత్తైన ఈ పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించేందుకు గతంలోనూ చాలా మంది ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే కొన్ని రోజుల కిందట ఒక స్పెయిన్ పర్వతారోహకుడు చనిపోయారు. 2008లో మంచు చరియలు విరిగిపడటంతో 11 మంది పర్వతారోహకులు మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)