బీబీసీ 100 మంది మహిళలు: మహిళల మీద హింసపై పాటతో పోరాడుతున్న జహారా

వీడియో క్యాప్షన్, బీబీసీ 100 మంది మహిళలు: మహిళల మీద హింసపై పాటతో పోరాడుతున్న జహారా

ఆమె పేరు జహారా. దక్షిణాఫ్రికాలో జహారా ఆల్బమ్‌ కాపీలు ఐదు లక్షలకు పైనే అమ్ముడయ్యాయి.

ఆమెకు చాలా అవార్డులు వచ్చాయి. అయినప్పటికీ.. ఆమె కూడా లింగ వివక్ష హింస బాధితురాలే.

దక్షిణాఫ్రికాలో గత ఏడాది 2,700 మంది మహిళలు హత్యకు గురయ్యారు.

జహారా ఆర్మీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి బాలికలు, యువతులకు సాయం చేస్తున్నారామె.

‘‘మహిళలు తమ సొంతమని పురుషులు అనుకుంటారు. మనం ఏం చేస్తున్నాం. ఏం కలలు కంటున్నాం అనేవేవీ వారికి అనవసరం’’ అంటారు జహారా.

ఇటువంటి హింస విషయంలో మహిళలు మౌనం దాల్చరాదని.. గొంతెత్తాలని జహారా పిలుపునిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)