ఆ ఉల్క భూమిని ఢీకొట్టకపోతే డైనోసార్లు ఇప్పటికీ ఉండేవా? మానవ జాతి ఉనికిలోకి వచ్చేదేనా?

వీడియో క్యాప్షన్, ఆ ఉల్క భూమిని ఢీకొట్టకపోతే డైనోసార్లు ఇప్పటికీ ఉండేవా? మానవ జాతి ఉనికిలోకి వచ్చేదేనా?

డైనోసార్ల ఆద్యంతాల గురించి రకరకాల వాదనలున్నాయి.

అవి దాదాపు అంతరించే దశకు చేరుకున్న స్థితిలో... 6 కోట్ల 60 లక్షల సంవత్సరాల క్రితం ఒక ఉల్క భూమిని ఢీకొట్టడంతో వాటి జాతి పూర్తిగా నశించిపోయిందని శాస్త్రవేత్తలు నమ్ముతూ వచ్చారు.

కానీ బ్రిటన్‌లో జరిగిన ఒక తాజా పరిశోధనలో ఒక కొత్త అంశం వెల్లడైంది. ఆ వినాశకరమైన ఘటన జరక్కపోయి ఉంటే డైనోసార్లు ఇంకా రాజ్యమేలుతూ ఉండేవని తేల్చారు పరిశోధకులు.

మాల్టా దేశమంతా పరిమాణంలో ఉన్న ఓ ఉల్క.. బుల్లెట్ వేగానికి 20 రెట్ల వేగంతో దూసుకొచ్చి భూమిపై పడింది.

6 కోట్ల 60 లక్షల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనే డైనోసార్ల జాతి అంతం కావడానికి కారణమని సైంటిస్టులు నమ్ముతున్నారు.

అయితే, అంతకన్నా ముందు ఏం జరుగుతూ వచ్చిందన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

డైనోసార్లు అప్పటికే క్షీణదశకు చేరుకున్నాయని, ఉల్కాపాతంతో అవి పూర్తిగా అంతమయ్యాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు.

కానీ నిజానికి ఆనాటికి డైనోసార్ల జాతి వృద్ధిలోనే ఉందని, ఉల్క పడకపోయి ఉంటే భూమిపై పరిస్థితులు భిన్నంగా ఉండేవని ఈ కొత్త అధ్యయనం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)