రాళ్లను డీకొన్న భారీ ఓడ, అందులో 400 మందికి పైగా ప్రయాణికులు

వీడియో క్యాప్షన్, రాళ్లను డీకొన్న ఓడ, అందులో 429 మంది ప్రయాణికులు

ఈ ప్రయాణికుల ఓడ బాల్టిక్ సముద్రంలో ఫిన్‌లాండ్ తీరం వద్ద రాళ్లను డీకొట్టింది. దాంతో, 429 మంది రాత్రంతా అందులోనే చిక్కుకుపోయారు. ఈ ఘటన శనివారం నాడు జరిగింది.

ఆదివారం ఉదయం దానిని సమీపంలోని పోర్టుకు తరలించామని ఫిన్‌లాండ్ తీరరక్షక దళం తెలిపింది. ప్రయాణికులను ఖాళీ చేయించారు.

ఓడలోప్రయాణిస్తున్నవారందరూ క్షేమంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)