You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీటిల్ మీద బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్: తాజా ఆవిష్కరణ
బీటిల్ వంటి సజీవ కీటకాలు కూడా మోసుకెళ్లగలిగేలా పరిశోధకులు ఒక చిన్న వైర్‌లెస్ కెమెరాను తయారు చేశారు.
తక్కువ శక్తితో నడిచే ఈ కెమెరా వ్యవస్థను తయారు చేసిన అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ, దానికి కీటకాల నుంచే స్ఫూర్తి పొందింది.
కీటకాలపై ఉన్న ఈ కెమెరాతో, దగ్గర్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు బ్లాక్ అండ్ వైట్‌లో సెకనుకు ఐదు ఫ్రేముల రిజల్యూషన్‌తో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వవచ్చు.
ఈ పరిశోధన గురించి సైన్స్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురించారు.
ఈ కెమెరా మొత్తం బరువు కేవలం 250 మిల్లీగ్రాములు ఉంటుంది. అంటే అది ప్లేయింగ్ కార్డ్ బరువులో పదో వంతు.
దీనికి ఉన్న సెన్సర్ తక్కువ రిజల్యూషన్‌తో ఉంటుంది. అది 160 బై 120 పిక్సెల్ ఫొటోలు కాప్చర్ చేస్తుంది. ఒక పక్క నుంచి మరో పక్కకు తిరిగే ఒక మెకానికల్ చేతికి ఈ కెమెరాను బిగిస్తారు.
ఆ చేయి సాయంతో ఈ కెమెరాను అటూ ఇటూ తిప్పి చూడవచ్చు. పరిసరాలను స్కాన్ చేయవచ్చు. అధిక రిజల్యూషన్ ఉన్న స్పష్టమైన ఫొటోలు తీయవచ్చు.
దీని బ్యాటరీ ఎక్కువ సమయం వచ్చేలా పరిశోధకులు ఈ సిస్టంలో ఒక ఆక్సిలోమీటర్ కూడా అమర్చారు. దాని సాయంతో కీటకం కదులుతున్నప్పుడు కెమెరా ఫొటోలు మాత్రమే తీస్తుంది.
అలా, ఫుల్ చార్జింగ్‌తో ఈ కెమెరా ఆరు గంటలపాటు పనిచేయగలుగుతుంది.
“ఈ పరిశోధనలో పేడపురుగులకు ఎలాంటి ప్రమాదం కలగలేదు. అవి దాదాపు ఏడాది పాటు జీవించాయి” అని పరిశోధనల తర్వాత వారు చెప్పారు.
ఈ పరిశోధకులు తాము నేర్చుకున్న వాటిని స్వతంత్రంగా నడిచే కీటకం సైజున్న ఒక కెమెరా రోబోను తయారుచేయడానికి ఉపయోగించారు.
“ప్రపంచంలో వైర్‌లెస్ విజన్‌తో స్వయం శక్తి ద్వారా భూమిపై నడిచే అతి చిన్న రోబోట్ ఇది ఒక్కటే” అని ఈ టీమ్ చెబుతోంది.
చక్రాలు లేని ఈ రోబో వైబ్రేషన్ ద్వారా కదులుతుంది. అది సెకనుకు మూడు సెంటీమీటర్ల దూరం వెళ్లగలదు.
ఈ చిన్నకెమెరా రోబోలు కొత్త నిఘా సమస్యలను సృష్టించవచ్చని ఈ పరిశోధనలు చేసిన సీనియర్ ఆథర్ శ్యామ్ గొల్లకోట గుర్తించారు.
“పరిశోధకులుగా ఇలాంటి వాటి గురించి పబ్లిక్ డొమైన్లో పెట్టడం చాలా ముఖ్యం అని మేం బలంగా నమ్ముతున్నాం. అప్పుడే, జనాలకు వాటి నష్టాల గురించి తెలుస్తుంది. అలా, జనం వాటికి పరిష్కారాలతో ముందుకు రావడం మొదలవుతుంది” అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)