You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాక్‌డౌన్: వరుసపెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎందుకు చూస్తాం? టీవీకి ఎందుకు అతుక్కుపోతాం?
టీవీని నిర్విరామంగా చూస్తున్నారా? లేక నెట్ ఫ్లిక్స్‌లో ‘డార్క్’, ‘మనీ హీస్ట్’ లాంటి సిరీస్‌లని ఆపకుండా చూస్తున్నారా?
మీరు అభిమానించే సిరీస్‌లో జరిగిన హత్య ఉదంతం వెనక పాత్రధారులెవరో తెలుసుకోవాలనే ఉత్కంఠతో ఉన్నారా?
లేదంటే.. రోజంతా సోఫాలో కూర్చుని, ఎక్కడికీ కదలకుండా టీవీలో ప్రసారమవుతున్న షోలను చూస్తున్నారా?
అయితే ఇలా చేస్తున్నది మీరొక్కరే కాదు. లాక్ డౌన్‌లో ఇంట్లోనే సమయం గడుపుతున్న లక్షలాది మంది ఇదే పని చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లాంటి వీడియో స్ట్రీమింగ్ సంస్థలకి రికార్డ్ స్థాయిలో సబ్‌స్క్రైబర్లు పెరిగారు. 2020 మొదటి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌కి కోటీ 60 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు పెరిగారు.
లాక్ డౌన్‌కి ముందు కూడా కొంతమంది ఎడతెగకుండా టీవీ కానీ, వెబ్ సిరీస్‌లు కానీ చూసే వారు. యూకేలో కొంత మంది ప్రేక్షకులు 8 గంటల పాటు నిర్విరామంగా టీవీ షో చూస్తామని ‘ది రేడియో టైమ్స్’ నిర్వహించిన సర్వే లో తెలిపారు.
ఇది మీకు చిర పరిచితంగా అనిపిస్తుంటే మీకు కూడా గంటల తరబడి ఈ షోలని చూస్తున్న న్యూనతా భావం వెంటాడవచ్చు. ఇలాంటి స్థితినే మీరు కూడా అనుభవిస్తూ ఉంటే ఈ వ్యాసం చదివితే మీరు కాస్త ఊరట పొందే అవకాశం ఉంది.
నిర్విరామంగా షో లని వీక్షించడానికి స్ట్రీమింగ్ కంపెనీలు పాటించే చిట్కాలు
నిర్విరామంగా ఈ సిరీస్‌లని చూడటం మీ తప్పు కాదు. మీరు అలా చూసేలా చేసేందుకు కొన్ని స్ట్రీమింగ్ యాప్‌లు కొన్ని తేలికపాటి చిట్కాలని ఉపయోగిస్తాయి.
“నేను రోజంతా కూర్చుని ఒక సిరీస్‌ని పూర్తిగా చూసేయగలను” అని టీవీ షోల విశ్లేషకుడు స్కాట్ బ్రయిన్ చెప్పారు. నిర్విరామంగా చూడటం అనుకోకుండా అలవాటైందని అన్నారు.
"చాలా షోలని ఒకే సారి చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారని నెట్ ఫ్లిక్స్ గ్రహించింది. నెట్ ఫ్లిక్స్ తమ షోలకి ప్రేక్షకులు అంటి పెట్టుకునే విధంగా చేయడానికి చిన్న చిన్న చిట్కాలు వాడుతుంది”.
వారు ఏదైనా కొత్త షో లాంచ్ చేయగానే ఆ షో కి ఏ థంబ్ నెయిల్ పని చేస్తుందో చాలా తొందరగా కనిపెడతారు. ఒక సిరీస్‌లో ఒక భాగం చూడటం పూర్తి కాగానే మరో ఎపిసోడ్ లోడ్ అయిపోతుంది.
ఇలాంటి చిట్కాల వలన కూడా ఒక షోని మూడు గంటల పాటు వరస పెట్టి చూసే అవకాశం ఉంటుంది.
నిర్విరామంగా చూడటానికే కొన్ని ప్రత్యేక కార్యక్రమాలని రూపొందిస్తారు
టీవీ కార్యక్రమాలని ప్రసారం చేసే చాలా కంపెనీలు నిర్విరామంగా చూసేందుకే కొన్ని కార్యక్రమాలని రూపొందిస్తున్నారని మీరు గమనించారా?
నెట్ ఫ్లిక్స్ తాను రూపొందించే కార్యక్రమాల్లో పాత్రధారులతో, కథలతో చాలా ప్రయోగాలు చేస్తుందని స్కాట్ అన్నారు. ఇందుకు "ఆరంజ్ ఐస్ ది న్యూ బ్లాక్" సిరీస్‌ని ఉదాహరణగా పేర్కొన్నారు.
ఈ షో లో సుమారు 40 మంది నటీ నటులు ఉన్నారు. ఈ సిరీస్‌ని 60 నిమిషాల చొప్పున 8 భాగాలుగా విడుదల చేశారు.
అయితే ఇలా ఎడతెగకుండా టీవీ చూడటం వలన అనవసరమైన ఆందోళన ఒత్తిడికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది ప్రాణానికే ప్రమాదమని 2016లో జపాన్‌లో కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వలన రక్త ప్రసరణ ఆగిపోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమాలని ఆగకుండా చూడటం వలన నాడీ వ్యవస్థని దెబ్బ తీసి, నిద్రపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సైకో థెరపిస్ట్ డాక్టర్ హామీర రియాజ్ అన్నారు.
“ఎడతెగకుండా ఒక షో ని వీక్షించాలంటే మనల్ని మనం ఎక్కువ సేపు ఉత్తేజితంగా ఉండటానికి సంసిద్ధం చేసుకుంటాం. ఆ స్థితి నుంచి యధా స్థితికి రావడానికి సమయం పడుతుంది”.
ఒక హింసాత్మక ఘటన - ముఖ్యంగా మీ అభిమాన పాత్రని ఎవరైనా హత్య చేస్తే - మీ నాడీ వ్యవస్థలో సానుభూతి ఉత్పన్నమవుతుంది. దీంతో మీ నిద్రకి భంగం కలగవచ్చని రియాజ్ చెప్పారు.
కానీ, ప్రేమని ఉత్ప్రేరకం చేసే హార్మోన్ మంచి అనుభూతిని ఇస్తుంది.
మనం మళ్ళీ మళ్ళీ ఈ షోలని చూడటానికి కారణం ఏమిటి?
“మనం షోలో ఒక పాత్రతో మనల్ని మనం ఆపాదించుకున్నప్పుడు ప్రేమని పుట్టించే ఆక్సీటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది. దీంతో ఒక బంధం ఏర్పడుతుంది” అని రియాజ్ అన్నారు.
ఇప్పుడు టీవీల్లో కానీ, సినిమా, వెబ్ సిరీస్‌లో కానీ ఏదైనా ఒక పాత్రతో మనల్ని మనం ఆపాదించుకోవడం చాలా సులభం. ఆ పాత్రతో పాటు మనం ప్రయాణం చేయవచ్చు.
బంధాలని పెంపొందించుకోవచ్చు
ఇది విచిత్రంగా అనిపించవచ్చు.
లవ్ ఐలాండ్ సిరీస్‌ని తీసుకుంటే అందులో అందరూ పెళ్లి కాని అందమైన యువతీ, యువకులు తమ భాగస్వామిని ఎంచుకునే ప్రయత్నంలో ఉంటారు.
2019లో ఈ షో ప్రసారం అవ్వడం మొదలవ్వగానే యూకేలో కౌన్సిలింగ్‌కి వెళ్లే జంటల సంఖ్య 41 శాతం పెరిగింది.
“ఒక సిరీస్ మొదటి నుంచి చివరి వరకు చూడటానికి సిద్ధపడ్డామంటే, మన భావోద్వేగాలను, సంబంధాలను కూడా సరి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం” అని రియాజ్ అన్నారు.
చాలా మంది తాము చూసే షో లతో చాలా అనుబంధం ఏర్పరచుకుంటారు.
ఆ సమయంలో మన మెదడుకి.. నిజానికి, ఊహకి మధ్య ఉండే తేడాని అర్ధం చేసుకునే వీలు ఉండదని రియాజ్ వివరించారు.
బహిరంగ చర్చల్లో పాల్గొనాలని అనుకుంటాం
ఈ షోలు చూడకపోతే ఏదైనా కోల్పోతున్నామేమో (ఫియర్ అఫ్ మిస్సింగ్ ఔట్) కూడా వీటిని చూసేలా చేస్తుంది.
“నేను ఒక రోజు టీవీ 10 గంటల పాటు చూసాను. అది నాకు నచ్చలేదు” అని షో బిన్జ్ ఇంటరాక్టివ్ ఆర్ట్ రూపకర్త బ్రయిన్ లోబెల్ అన్నారు.
బహిరంగ చర్చల్లో పాల్గొనడానికి చాలా సార్లు కొన్ని షోలు చూస్తామని ఆయన అన్నారు.
ఫలానా సిరీస్‌లో ఏమి జరుగుతుందో చూడాలనే ఉత్సుకత వీక్షకులని ఎక్కువ సేపు చూసేటట్లు చేస్తోందని అన్నారు.
ఏదైనా షో లని నిర్విరామంగా చూడటం అనేది ప్రతికూలంగా అనిపిస్తుంది.
చాలా మంది ఎక్కువ సేపు టీవీ చూస్తున్నందుకు ఇబ్బందిగా భావిస్తూ ఉంటారు.
‘‘ఏ పనీ చేయకుండా టీవీ చూస్తూ కూర్చుంటా.. ఎందుకంటే ఇవాళ నేను నా ఆఫీస్ పని నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా’’ అని చాలామంది అంటూ ఉంటారు.
మీరు కూడా ఈ ఇలా చూసే వారిలో ఒకరైతే , ఆత్మ న్యూనతా భావంతో బాధపడనవసరం లేదని బ్రయిన్ అన్నారు.
సాధారణంగా ‘‘నేను పుస్తకంలో మునిగిపోయాను’’ అని అనం. నిజానికి కొంత మంది ఉత్తమ రచయతలు ఇప్పుడు టీవీ కోసం రచనలు చేస్తున్నారు.
"తదేకంగా ఈ సిరీస్‌లని చూడకండి అని నేను చెప్పను".
మీరు ఈ సిరీస్‌లని చూసి ఆనందిస్తున్నట్లైతే, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజు ఆస్వాదించండి.
ఈ వ్యాసం బీబీసీ ఐడియాస్ నుంచి తీసుకున్నాం.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- చెన్నై సిక్స్: ‘చేయని నేరానికి చిక్కుకుపోయా.. భారతీయ జైల్లోనే చచ్చిపోతా అనుకున్నా’ - బ్రిటన్ మాజీ సైనికుడి కథ
- ఇంటెన్సివ్ పేరెంటింగ్ అంటే ఏమిటి? ఈ తరహా పెంపకం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
- భారత మార్కెట్లో 'వెబ్‌సిరీస్'ల జోరు
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- కరోనావైరస్: వుహాన్‌లో ప్రజలందరికీ 10 రోజుల్లో పరీక్షలు చేయడం చైనాకు సాధ్యమేనా?
- కరోనావైరస్: కోయంబేడు మార్కెట్ నుంచి కోనసీమకు... ‘ఏపీలోని 10 జిల్లాలకు దిగుమతి’
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)