You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనాలో 5జీ నెట్‌వర్క్ ప్రారంభం... ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు
చైనాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దీనితో చైనా ప్రపంచస్థాయిలో టెక్నాలజీ పరంగా ఒక పెద్ద ముందడుగు వేసినట్లయింది.
చైనాలోని ప్రభుత్వ మొబైల్ ఆపరేటర్లు చైనా మొబైల్, చైనా యూనికామ్, చైనా టెలీకామ్ గురువారం నుంచి తమ 5జీ డేటా ప్లాన్లు ప్రకటించాయి.
ట్రేడ్, టెక్నాలజీ అంశాల్లో చైనా-అమెరికా ఢీ అంటే ఢీ అంటున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది.
చైనా కంటే ముందు దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ తమ దేశాల్లో ఈ ఏడాది 5జీ నెట్‌వర్క్ ప్రారంభించాయి.
5జీ అయిదో జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్. 5జీలో ఇంటర్నెట్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుందని చెబుతున్నారు.
5జీ డేటా ప్లాన్ ధర ఎంత?
మొదట్లో వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని చెప్పిన చైనా, తర్వాత ఆ చర్యలను వేగం చేసి, ఇదే ఏడాది 5జీ సేవలు అందించింది.
ఈ సూపర్ ఫాస్ట్ సేవలు చైనాలోని 50 నగరాల్లో ప్రారంభమయ్యాయి. వీటిలో బీజింగ్, షాంఘాయ్ ఉన్నాయి. 5జీ డేటా ప్లాన్ ధరలు 128 యువాన్ల( దాదాపు 1300 రూపాయలు) నుంచి 500 యువాన్ల(6 వేల రూపాయలు) వరకూ ఉన్నాయని చైనా ప్రభుత్వ సమాచార సంస్థ షిన్హువా చెప్పింది.
చైనాలో 5జీ సేవలు ప్రారంభించే నెట్‌వర్క్‌కు సంబంధించిన ఎక్కువ పరికరాలను హువావే కంపెనీ సరఫరా చేసింది. మిగతా చాలా దేశాల్లో 5జీ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడంలో ఈ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది.
హువావే కంపెనీని అమెరికా బ్లాక్‌లిస్టులో పెట్టడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ కంపెనీ వల్ల తమ జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా చెప్పింది.
హువావే స్వయంగా తమపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించింది. అమెరికా చర్యలను చైనాలో కూడా ట్రేడ్ వార్‌లా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అదిగదిగో 5జీ: ఈ 5జీ వస్తే ఎలా ఉంటుంది?
- 2జీ.. 3జీ.. 4జీ.. మరి 5జీ ఎప్పుడు?
- 5జీ టెక్నాలజీతో విమానాల భద్రతకు, సైనిక చర్యలకు పొంచి ఉన్న ప్రమాదమేంటి..
- హువావే: ఈ చైనా ఫోన్ల తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద కంపెనీ ఎలా అయింది?
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- నీళ్లు, టాయిలెట్ పేపర్, మొక్కజొన్న పొత్తు... బాత్రూమ్లో ఒక్కో దేశానిది ఒక్కో అలవాటు
- మీ ఇంట్లో అత్యంత మురికైనది ఏమిటో మీకు తెలుసా...
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- జపాన్ కాకులు కనిపెట్టిన రహస్యమేంటి? నగర జీవనానికి జంతువులు, పక్షులు ఎలా అలవాటుపడుతున్నాయి?
- డేటింగ్ యాప్స్ వాడే వాళ్లు అందం కోసం ఏం చేస్తున్నారో ఊహించగలరా
- తిర్హుత్ ప్రైవేటు రైల్వే: గాంధీ కోసం మూడో తరగతి బోగీలో టాయిలెట్, నెహ్రూ కోసం 'ప్యాలెస్ ఆన్ వీల్స్'
- కేకులు, బన్నులు తింటే కేన్సర్ వస్తుందా?
- నెయిల్ ఎక్స్టెన్షన్: గోళ్లను అతికించుకోవడం ఇప్పుడో ట్రెండ్
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- ఇస్లామిక్ యోగా: యోగా క్లాసుల్లో అల్లా ప్రార్థనలు చేస్తున్న గుజరాత్ ముస్లిం మహిళలు
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)