You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#ENGvPAK ఇంగ్లండ్‌పై 14 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం
క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై పాకిస్తాన్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ పది ఓవర్ల లోపే ఓపెనర్లను కోల్పోయింది.
మూడో ఓవర్లో 12 పరుగులు దగ్గర ఇంగ్లండ్ తొలి వికెట్ పడింది. ఓపెనర్ జాసన్ రాయ్(8) షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.
9వ ఓవర్లో 60 పరుగుల దగ్గర ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన ఓపెనర్ బెయిర్‌స్టో వాహాబ్ రియాజ్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చాడు.
15వ ఓవర్లో ఇయాన్ మోర్గాన్(09) మూడో వికెట్‌గా అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 86 పరుగులు ఉన్నప్పుడు మహమ్మద్ హఫీజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
18వ ఓవర్లో ఇంగ్లండ్ 100 పరుగులు చేసింది.
23వ ఓవర్లో 118 పరుగుల దగ్గర బెన్ స్టోక్స్(13) అవుట్ అయ్యాడు. షోయబ్ మాలిక్ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చాడు.
32వ ఓవర్లో ఇంగ్లండ్ 200 పరుగులు పూర్తి చేసింది.
ధాటిగా ఆడిన జో రూట్ 97 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.
39వ ఓవర్లో 248 స్కోరు దగ్గర షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో రూట్(107) ఇచ్చిన క్యాచ్‌ను మహమ్మద్ హఫీజ్ పట్టాడు.
జాస్ బట్లర్ కూడా 75 బంతుల్లో సెంచరీ(108) పూర్తి చేశాడు. కానీ తర్వాత బంతికే అవుటయ్యాడు. 45వ ఓవర్లో మహమ్మద్ అమీర్ బౌలింగ్‌లో వహాబ్ రియాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
47వ ఓవర్లో ఇంగ్లండ్ 300 పరుగులు చేరింది. జట్టు స్కోరు 320 పరుగుల దగ్గర మొయిన్ అలీ అవుటయ్యాడు.
48వ ఓవర్లో వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి ఫకర్ జమాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
తర్వాత బంతికి క్రిస్ వోక్స్(21) కూడా అవుటవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.
49 ఓవర్ మూడో బంతికి ఇంగ్లండ్ 9వ వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్(1) అమీర్ బౌలింగ్‌లో వహాబ్‌కు క్యాచ్ ఇచ్చాడు.
ఇగ్లండ్‌కు విజయం కోసం చివరి ఆరు బంతుల్లో 25 పరుగులు అవసరమైంది.
అదిల్ రషీద్(03), మార్క్ వుడ్(10) క్రీజులో ఉన్నారు.
- మొదటి బంతి పరుగు రాలేదు
- రెండో బంతికి 4 పరుగులు వచ్చాయి.
- మూడో బంతి డాట్ బాల్.
- నాలుగోబంతికి వుడ్ ఒక్క పరుగు తీశాడు.
- ఐదో బంతికి రషీద్ ఒక పరుగు తీశాడు.
- చివరి బంతికి 19 పరుగులు అవసరం కాగా వుడ్ ఫోర్ కొట్టాడు.
దీంతో పాకిస్తాన్ 14 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.
పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్‌కు 3, షాదాబ్ ఖాన్, మహమ్మద్ అమీర్‌కు చెరి రెండు వికెట్లు పడ్డాయి. మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్ తలో వికెట్ తీశారు.
అంతకు ముందు...
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 15 ఓవర్ తొలి బంతికి 82 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన ఓపెనర్ ఫకర్ జమాన్‌ను మొయిన్ అలీ బౌలింగ్‌లో కీపర్ జాస్ స్టంపింగ్ చేశాడు.
111 పరుగుల దగ్గర పాక్ రెండో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
33 ఓవర్ 5వ బంతికి జట్టు స్కోరు 199 పరుగుల దగ్గర పాకిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన బాబర్ అజాం మొయిన్ అలీ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
43 ఓవర్ 4వ బంతికి 84 పరుగులు చేసిన మహమ్మద్ హఫీజ్ అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 279 పరుగుల దగ్గర మార్క్ వుడ్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
46 ఓవర్లో పాక్ స్కోరు 300 పరుగులు దాటింది.
47 ఓవర్లో తొలి బంతికి పాక్ ఐదో వికెట్ కోల్పోయింది. 311 పరుగుల దగ్గర 14 పరుగులు చేసిన ఆసిఫ్ అలీ మార్క్ వుడ్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు.
క్రిస్ వోక్స్ వేసిన 48 ఓవర్లో పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. 2వ బంతికి కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(55), ఐదో బంతికి వాహాబ్ రియాజ్(4) అవుటయ్యాడు.
50వ ఓవర్ తొలి బంతికి షోయబ్ మాలిక్(08) కూడా క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. 8వ వికెట్ పడినప్పుడు స్కోరు 337.
తర్వాత హసన్ అలీ(10), షాదాబ్ ఖాన్(10) జట్టు స్కోరును 348కి చేర్చారు. నాటౌట్‌గా నిలిచారు.
ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మొయిన్ అలీ మూడేసి వికెట్లు పడగొట్టగా, మార్క్ వికెట్ రెండు వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి:
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- తియనాన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది
- 45 రోజుల్లో 99 శాతం దోమల నిర్మూలన.. సాలీడు విషంతో చేసిన ప్రయోగాలు సక్సెస్
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- రిషబ్ పంత్‌ను ఎందుకు తీసుకోలేదంటే...: విరాట్ కోహ్లీ
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- వరల్డ్ కప్ 1983: టీమ్ ఇండియా తొలి ప్రపంచ కప్ విజయం వెనుక కథ ఇదే..
- క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?
- ఇచట అమ్మానాన్నలు, భార్యాభర్తలు అద్దెకు ఇవ్వబడును
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)