ఇథియోపియాలో కూలిన విమానం: ఒక్కరు కూడా బతికిబయటపడలేదు

ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది.

ఇది అడ్డిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 44 నిమిషాలకు ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారని విమానయాన సంస్థ వెల్లడించింది.

ఇథియోపియా రాజధానిలో టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.

విమాన ప్రమాదంలో 149 ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది కూడా చనిపోయారని ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి చెప్పారు. వీరంతా 33 దేశాలకు చెందిన వారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.