పీఎంఎస్: కొందరిలో పీరియడ్లకు ముందు ఆత్మహత్యా ఆలోచనలు ఎందుకొస్తాయి?

వీడియో క్యాప్షన్, వీడియో: పీరియడ్లకు ముందు చాలామంది మహిళలను వేధించే సమస్య ప్రి-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్

పీరియడ్లకు ముందు చాలామంది మహిళలను వేధించే సమస్య ప్రి-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్(పీఎంఎస్). నెలసరికి 5-7రోజుల ముందు పీఎంఎస్ మొదలవుతుంది.

ఈ సమయంలో మహిళలకు కడుపు, వక్షోజాల దగ్గర నొప్పిగా ఉంటుంది. ఉన్నట్టుండి మూడ్ మారిపోతుంది. చికాకు, కోపం, బాధ లాంటి ఉద్వేగాలకు లోనవుతారు. ఉన్నట్టుండి సంతోషం, దు:ఖం తన్నుకొస్తాయి. చిన్న విషయాలకే ఏడుపొస్తుంది.

పీఎంఎస్ దశలో హార్మోన్ల విడుదలలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా పొట్ట, వక్షోజాలు, ఇతర రహస్య భాగాలకు రక్తప్రసరణ ఎక్కువై నొప్పిగా అనిపిస్తుంది.

నెలసరి సమయంలోనూ ఈ లక్షణాలు కనిపించొచ్చు. నెలసరి ముగిశాక అవి దూరమవుతాయి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే విటమిన్ సప్లిమెంట్లు, పెయిన్ కిల్లర్లను వైద్యులు సిఫార్సు చేస్తారు.

మహిళ

ఫొటో సోర్స్, Getty Images

చాలామందికి ఈ సమస్య గురించి అవగాహన ఉండదు. కాబట్టి, కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల కాస్త ఊరట కలగొచ్చు.

పీఎంఎస్ తీవ్రమైతే అది ప్రి-మెన్‌స్ట్రువల్ డిస్ఫారిక్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. ఈ దశలో తీవ్రమైన ఒత్తిడి, చికాకు, నిద్ర లేమితో పాటు ప్రతికూల ఆలోచనలూ ఎక్కువవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలూ కలుగుతాయి. కొందరు మహిళలు తమను తామే గాయపరచుకుంటారు.

ఈ సమస్యకు చికిత్స అందుబాటులో ఉంది. కౌన్సెలింగ్ ద్వారా కూడా కొంత ఊరట కలుగుతుంది. పీఎంఎస్ ఓ మానసిక రుగ్మత అని చాలామంది భావిస్తారు. అది ఎంతమాత్రం నిజం కాదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)